ఏపీ, తెలంగాణ మధ్య సమసిన ఓ వివాదం..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న ఓ వివాదం సర్దుమణిగింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు వివాదం సమసిపోయింది. ఈ వ్యవహారం ఏకంగా కేసులు, బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడం వరకు చేరింది. అయితే ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ, తెలంగాణ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంప్రదింపలు జరిపారు. దీంతో వివాదం ముగిసింది.
జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవాలని ఇరు రాష్ట్రాలు ఓ నిర్ణయానికి వచ్చాయని సమాచారం. దీని ప్రకారం ఏపీకి రూ. 640 కోట్లు, తెలంగాణకు రూ. 465.64 కోట్లు అందనున్నాయి.రాబోయే వారం పదిరోజుల్లో ఈ సొమ్ము పీడీ ఖాతాలకు చేరుతుందని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల సాధనకు ఇదొక మంచి అడుగు అని అన్నారు. ఈ సందర్భంగా చొరవ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.