Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Contradiction between AP Government and Employees

By   /  February 16, 2016  /  Comments Off on Contradiction between AP Government and Employees

    Print       Email

budda - amaravathi

ఏపీకి వెళ్లేందుకు ఉద్యోగులు రెడీయేనా..?

InCorpTaxAct
Suvidha

 

ఏపీ నుంచి పాలన సాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగానే తాత్కలిక సచివాలయం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మొన్నటివరకు టెండర్లు ఖరారు కాకపోవడానికి కొన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రస్తుతం అవన్నీ తొలగిపోయాయి. టెండర్లు కూడా ఖరారయ్యాయి. అంతేకాదు.. వచ్చే జూన్ 15 లోపూ సెక్రటేరియట్ పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థలు కూడా అంగీకారం తెలిపాయి. మరి ఏపీకి ఉద్యోగులు తరలింపు అంశం ఎంతవరకు వచ్చింది..?

ముఖ్యమంత్రిని కలిసిన ఉద్యోగ సంఘాలు … కమిటీలు ఏర్పాటు..

ప్రస్తుత పరిస్థితులను బట్టి ఉద్యోగులు తరలివెళ్లేందుకు రెడీగా లేరని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం ఉద్యోగుల తరలింపు తప్పదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తర్వాత ఉద్యోగ సంఘాలు సీఎంను కలిశాయి. ఉన్నట్లుండి విజయవాడకు తరలిస్తే తమకు సమస్యలు ఎదురవుతాయని తేల్చి చెప్పారు. దీంతో ఉద్యోగులతో ఓ కమిటీ… సీఎస్ ఆధ్వర్యంలో మరో కమిటీ ఏర్పాటయ్యాయి. అయితే ఇటీవల కాలంలో ఆ కమిటీ భేటీ జరగలేదు. గత డిసెంబర్ నుంచి ఉద్యోగుల తరలింపు పై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో తాత్కలిక సెక్రటేరియట్ రెడీ అవుతున్నా ఉద్యోగులు వెళ్తారా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మార్చిలోనే విద్యార్ధుల ఫీజులు చెల్లింపులు.. సర్కారుకు కొత్త తలనొప్పులు..

ఇక ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా కొన్ని సమస్యలను చెబుతున్నాయి. పిల్లల చదువులకు సంబంధించి మార్చి నెలలోనే ఫీజులు చెల్లించాలని అంటున్నారు. జూన్ నెల గడువు పెడితే అందుకు నాలుగు నెలలు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. ఈలోగా విజయవాడలో ఇళ్ళు వెతుక్కోవడం కష్టమైన పని అని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి ఉద్యోగుల సమస్యలపై ఏపీ సర్కారు స్పందించాల్సి ఉంది. లేదంటే మరో కొత్త తలనొప్పి ప్రభుత్వానికి ఎదరయ్యే అవకాశం ఉంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →