Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Controversy brings Money and Popularity? Udta Punjab

By   /  June 22, 2016  /  Comments Off on Controversy brings Money and Popularity? Udta Punjab

    Print       Email

udtapunjabఎంత కాంట్ర‌వ‌ర్సీ  అయితే అంత డ‌బ్బు

 

InCorpTaxAct
Suvidha

 

 

సినిమా తీయ‌డం ఎంత క‌ష్ట‌మో.. ఆ సినిమాకు డ‌బ్బులు రాబ‌ట్టుకోవ‌డం కూడా అంతే క‌ష్టం. అయితే ఇటీవ‌ల కొంత‌మంది అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సినిమా తీయడం క‌ష్ట‌మేమో కానీ.. డ‌బ్బులు రాబ‌ట్ట‌డం చాలా సులువ‌ని నిరూపిస్తున్నారు. అందుకు వాళ్లు ఒక చిట్కా కూడా చెబుతున్నారు. అదేంటంటే సినిమా రిలీజ్‌కంటే ముందు ఆ సినిమాలోని కొన్ని స‌న్నివేశాల‌ను కాంట్ర‌వ‌ర్సీ చేస్తే దానిపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతుంద‌ని, అప్పుడు సినిమాకు ఫ్రీ ప‌బ్లిసిటీతో పాటు డ‌బ్బులు కూడా తెచ్చి పెడుతుంద‌ని చెబుతున్నారు. ఇప్పుడు వాళ్లు చెప్పిందే రుజువైంది కూడా. వివాదాల సునామీలో.. ఎన్నో అడ్డంకుల‌ను అధిగ‌మించి రిలీజ్ అయిన ఉడ్తా పంజాబ్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లు సాధిస్తోంది. పంజాబ్‌లో హెచ్చు మీరుతున్న డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారిని టార్గెట్‌గా చేసుకుని అభిషేక్ చుబే డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో షాహిద్ క‌పూర్‌, క‌రీనా క‌పూర్‌, ఆలియా భ‌ట్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్రల్లో న‌టించారు. రిలీజ్‌కు ముందు వివాదాలు, కోర్టులు, సెన్సార్ బోర్డు అభ్యంత‌రాలు ఎదుర్కొన్న ఉడ్తా పంజాబ్‌కు కోర్టు అక్షింతల త‌ర్వాత సెన్సార్ బోర్డు 13 క‌ట్స్‌తో ఏ స‌ర్టిఫికేట్ జారీ చేసింది. ముందుగా ఈ సినిమాకు ఏకంగా 100 క‌ట్స్ విధించారు. దీంతో సెన్సార్ బోర్డు ప‌నితీరు క్రియేటివిటిని చంపేసేదిగా ఉంద‌న్న విమ‌ర్శ‌లు దేశవ్యాప్తంగా వ్య‌క్త‌మ‌య్యాయి. ప‌లువురు బాలీవుడ్ హీరోలు, ద‌ర్శ‌కులు సైతం సెన్సార్ బోర్డు తీరును ఆక్షేపించారు.

ఈ శుక్ర‌వారం రిలీజ్ అయిన ఈ సినిమా ఫ‌స్ట్ వీకెండ్‌లో రూ 33.80 కోట్లు కొల్ల‌గొట్టింది. దీంతో ఈ సంవ‌త్స‌రం బాలీవుడ్‌లో రిలీజ్ అయిన సినిమాల్లో వీకెండ్‌లో ఎక్కువ వ‌సూళ్లు సాధించిన ఐదో చిత్రంగా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ముంబైతో పాటు ఢిల్లీ, పంజాబ్‌ల‌లో కూడా భారీ వ‌సూళ్లు వ‌స్తున్నాయి. శుక్ర‌వారం రూ 10.05, శ‌నివారం 11.25, ఆదివారం 12.50 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన ఉడ్తా పంజాబ్ ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌రికి అంచ‌నాల‌కు మించి రికార్డు స్థాయిలో వసూళ్లు రాబ‌డుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →