యంగ్ టైగర్ తో జనసేనానికి చెక్..?
నందమూరి ఫ్యామిలీకి – నారావారి ఫ్యామిలీకి ఉన్న అనుబంధం గురించి పెద్దగా చెప్పే పనిలేదు. 2009 ఎన్నికల సందర్భంగా ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు.. యంగ్ టైగర్ ను రంగంలోకి దించారు. అయితే తర్వాతి కాలంలో ఇరువురి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అలాగే బాబాయ్ బాలయ్యకు అబ్బాయ్ ఎన్టీఆర్ కి మధ్య కూడా గ్యాప్ పెరిగింది. రెండేళ్ల క్రితం ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ గ్యాప్ మరింత ఎక్కువైందని ఆ పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే ఎన్టీఆర్.. చంద్రబాబుకు, బాలయ్యకు దగ్గర అయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడని కూడా టాక్ నడించింది.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ని అమరావతి శంఖుస్థాపనకు గాని, టీడీపీ మహానాడుకు గాని ఆహ్వానించలేదు.
కాని.. చంద్రబాబు కృష్ణ పుష్కరాలకు ఎన్టీఆర్ ని ఆహ్వానించారు. దీనివెనుక బలమైన కారణం ఉందని అటు పార్టీ వర్గాలతో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ గత ఎన్నికల సందర్భంగా అటు బీజేపీ, ఇటు టీడీపీకి సహకారం అందించారు. ఆ తర్వాత ఆయన నుంచి పెద్దగా టీడీపీకి సహాకారం అందడం లేదు. దీనికి తోడు పవన్ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో ఒంటరి పోరాటం చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. దీంతో పవన్ ను ఎదుర్కోవాలంటే ఎన్టీఆర్ వల్లే అవుతుందని టీడీపీ అధినేత భావించారని.. అందుకే ఇప్పటి నుంచి ఎన్టీఆర్ ని దగ్గరకు తీసుకుంటున్నారని టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. ఏదిఏమైనా కృష్ణ పుష్కరాల పేరు చెప్పి నందమూరి ఫ్యామిలీ ఒక్కటిగా అయితే.. ముందు సంతోషించేంది అభిమానులే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.