Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

CPI Suravaram Sudhakar Reddy demands Modi’s apology to AP

By   /  April 9, 2018  /  Comments Off on CPI Suravaram Sudhakar Reddy demands Modi’s apology to AP

    Print       Email

దేశ ప్ర‌జ‌ల‌కు మోడీ క్ష‌మాప‌ణ చెప్పాలి

InCorpTaxAct
Suvidha

 

 

 

* రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీకి అన్యాయం జ‌రిగింది

* పార్ల‌మెంట్‌లో ఇచ్చిన ప్ర‌త్యేక హోదా హామీని అమ‌లు చేయ‌క‌పోవ‌డం సిగ్గుచేటు

* హోదా ఇవ్వ‌కూడ‌ద‌ని 14వ ఆర్థిక సంఘం చెప్ప‌లేదు

* ప్ర‌ధాని మోడీ బ‌తుకంతా అబ‌ద్ధాలే

* సీపీఐ రాష్ట్ర 26వ మ‌హాస‌భ‌లో సీపీఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుర‌వ‌రం సుధాక‌ర‌రెడ్డి

డెక్క‌న్ అబ్రాడ్‌: ప‌్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమ‌లు చేయ‌కుండా మోసం చేసిన ప్ర‌ధాన న‌రేంద్ర మోడీ దేశ ప్ర‌జ‌లంద‌రికీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని సీపీఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుర‌వ‌రం సుధాక‌ర్‌రెడ్డి డిమాండ్‌చేశారు. అబ‌ద్ధాలు చెప్ప‌డం.. మోసం చేయ‌డం మోడీగా బాగా అల‌వాటైంద‌ని మండిప‌డ్డారు.  కడపలో జ‌రిగిన  భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర 26వ మహాసభలలో సురవరం సుధాక‌ర్‌రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు. విభజనతో రాజధాని లేకుండా అన్యాయం జరిగిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం బాధ్యతను విస్మరించడం దారుణమన్నారు. పార్లమెంటులో చేసిన చట్టాన్ని అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరాదని 14వ ఆర్థిక సంఘం ఎప్పుడూ చెప్ప‌లేద‌న్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బతుకంతా అబద్ధాలేనని విమర్శించారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొనే దమ్ములేకే ఏఐఏడీఎంకే సభ్యులతో అల్లరి చేయించి, బడ్జెట్ సమావేశాలను బీజేపీ ప్రభుత్వం వృథా చేసిందని విమర్శించారు. వామపక్షాల పోరాటాల ఫలితంగానే రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుం దన్నారు. హోదా సాధన కోసం ఐక్యంగా ఉద్యమిం చాల్సిన సమయంలో రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా పరస్పర ఆరోపణలు చేసుకోవడం శోచనీయమన్నారు.

ఇప్పటికైనా అందరు కలిసి పోరాడి హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సురవరం పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ, మతోన్మాదాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో ముందుకు సాగుదామని సుధాకరరెడ్డి పిలుపు నిచ్చారు. ఇందుకోసం ప్రగతిశీల, లౌకిక శక్తులతో కలసి ఐక్య వేదికను రూపొందిస్తున్నామని, 2019 ఎన్నికలే మోదీకి డెడ్‌లైన్ అని పేర్కొన్నారు. దేశంలో దళితులను, మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చారని విమర్శించారు. ఓ వైపు అంబేద్కర్ విగ్రహాలను పడగొడుతూ, మరోవైపు ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేస్తూ, ఆయన భావజాలాన్ని గౌరవిస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మతం పేరుతో ప్రజలను చీలుస్తున్నారని వివుర్శించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →