Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Crazy News about Bala Krishna 100th Movie..

By   /  March 27, 2016  /  Comments Off on Crazy News about Bala Krishna 100th Movie..

    Print       Email

balakrishna2

బాలయ్య మీసకట్టు వందో సినిమా కోసమేనా..?

InCorpTaxAct
Suvidha

 

ఈ మధ్యకాలంలో నందమూరి అందగాడు బాలయ్య చేసిన ప్రతి సినిమా సంచలన విజయాలు నమోదు చేసింది. అంతేకాదు.. ప్రస్తుతం ఆయన వందో సినిమాకు కౌంట్ డౌన్ కూడా మొదలైంది. దీంతో ఆయన అభిమానుల్లో వందో సినిమాపై విపరీతమైన ఆశక్తి నెలకొంది. అలాగే సింహా, లయన్, లెజెండ్, డిక్టేటర్ లాంటి సినిమాల్లో బాలయ్య గెటప్ లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ సినిమాలు వరుసగా సక్సెస్ కావడంతో వందో సినిమాలో బాలకృష్ణ ఆహార్యం ఎలా ఉండబోతోందని అభిమానులు అప్పుడే ఆరా తీయడం మొదలుపెట్టేశారు.

ప్రముఖ దర్శకుడు క్రిష్‌తో ఆయన వందో సినిమా ఉండవచ్చన్నది ఫిల్మ్‌నగర్‌ టాక్. గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రలో బాలయ్యబాబు కనిపిస్తారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే బాలయ్య 100వ సినిమా కోసమే ఇప్పుడు మీసాలను పెంచుతున్నారా..? శాతకర్ణి పాత్రలో ఆయన ప్రత్యేకమైన మీసకట్టుతో దర్శనమిస్తారా..? అన్నది ఇప్పుడు ఆశక్తికరంగా మారిపోయింది. విజయవాడలో శుక్రవారం జరిగిన ‘రాజా చెయ్యి వేస్తే..’ ఆడియో ఫంక్షన్ లో బాలకృష్ణ మీసకట్టును చూసిన ప్రతి ఒక్కరికీ ఈ అనుమానం మొదలైంది. ఈ స్టైల్‌ 100వ సినిమా కోసమేనా..? అన్నది అభిమానుల అనుమానం. అయితే వందో సినిమాపై అధికారికంగా ప్రకటన వెలువడే వరకు ఈ సస్పెన్స్ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →