Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Pune beats Hyderabad Sun risers in IPL..

By   /  April 22, 2017  /  Comments Off on Pune beats Hyderabad Sun risers in IPL..

    Print       Email

iplచెలరేగిన ధోనీ.. హైదరాబాద్ పై పూణె విజయం..

 

InCorpTaxAct
Suvidha

 

 

ఐపీఎల్‌-10లో భాగంగా స‌న్ రైజ‌ర్స్‌ హైదరాబాద్‌, పూణె జ‌ట్ల మ‌ధ్య రసవత్తర పోరు సాగింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ 177 రన్స్ టార్గెట్ ను పూణె ముందు ఉంచింది. అయితే మ్యాచ్ చివరిలో హోరాహోరీ పోరు సాగింది. అయితే హైదరాబాద్ జట్టుపై పూణె ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 34 బంతుల్లో 61 రన్స్ చేసిన మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ పూణెను విజ‌య‌తీరానికి తీసుకెళ్లాడు.

ఫామ్ లోకి వచ్చిన ధోనీ..
కొద్దికాలం ధోనీ ఫామ్ లో లేని విషయం తెలిసిందే. అయితే తాజా మ్యాచ్ తో ధోనీ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక టార్గెట్ రీచ్ అయ్యే క్రమంలో పుణె ఓపెనర్ రహానే(2) అతితక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు.అయితే మరో ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి(59 : 41 బంతుల్లో 6×4, 3×6) ఆకట్టుకున్నాడు. అతను స్మిత్‌తో కలిసి చెలరేగి ఆడాడు. ఐపీఎల్ లో ఫస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 11వ ఓవర్‌ చివరి బంతికి స్మిత్‌(27: 21 బంతుల్లో 1×4, 2×6) రశీద్‌ ఖాన్‌ బౌలింగ్‌ లో ఔట్ అయ్యాడు.

తర్వాత 14వ ఓవర్‌ తొలి బంతికి త్రిపాఠి రనౌట్‌ అయ్యాడు.అయితే క్రీజులో ఉన్న ధోని చెలరేగి ఆడి హైదరాబాద్ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు 19వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌ బాదాడు. దీంతో మొత్తం 19 పరుగులు రాబట్టాడు. చివరి ఓవర్‌లో 11 రావాల్సి ఉంది. మనోజ్‌ తివారి మెుదటి బంతిని ఫోర్‌ కొట్టాడు. మరో మూడు బంతుల్లో మూడు సింగిల్స్‌ సాధించారు. ఐదవ బాల్ కి ధోని రెండు రన్స్ తీశాడు. దీంతో లాస్ట్ బాల్ లో రెండు రన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మ్యాచ్ లో ఉత్కంఠ పెరిగింది. ఇక ధోనీ లాస్ట్ బాల్ ని ఫోర్ కొట్టి తన జట్టును గెలిపించాడు. ధోని మొత్తం 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61 రన్స్ చేశాడు. మనోజ్‌ తివారి 17 రన్స్ చేశాడు. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, బిపుల్‌ శర్మ, రశీద్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →