మోడీకి సిద్దూ షాక్
ప్రధాని నరేంద్ర మోడీకి భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు షాకిచ్చారు. ఏమైందో ఏమో కానీ గత ఏప్రిల్ నెలలో భారతీయ జనతా పార్టీ తరపునుంచి రాజ్యసభకు ఎన్నికైన సిద్దూ రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఆయనే కాదు ఆయన భార్య కూడా రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిద్దూ రాజీనామా చేయడంపై ఉత్కంఠ నెలకొంది. గతంలో రెండుసార్లు అమృతసర్ నియోజక వర్గం నుంచి సిద్ధూ ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2014 వరకూ అమృతసర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి సిద్ధూ ఎంపికయ్యారు. అయితే ఆ నియోజకవర్గం నుంచి అరుణ్ జైట్లీ పోటీ చేయడంతో ఆ స్థానాన్ని సిద్దూ వదులుకోవాల్సి వచ్చింది. పంజాబ్ నుండి సిద్దు బీజేపీ లో ఉన్నంత కాలం శిరోమణి అకాళీదళ్ అడుగడునా అడ్డుపడింది. ఏకంగా బాదల్ తనుయుడే సిద్దు ను అడ్డుకున్నారు.
పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్ అభివృద్ధి జరగకుండా అడ్డుకున్నా బీజేపీ మాత్రం మిత్రపక్షాన్ని ఏమీ అనలేక పోయింది. అంతేకాకుండా సిద్దూని కూడా ఈ విషయం లో మౌనంగా ఉండమని చెప్పడంతో ఈ డాషింగ్ ఓపెనర్ నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు పంజాబ్‌లో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న సిద్ధు భార్య కూడా తన పదవికి రాజీనామా చేయనున్నారు. అయితే వీరిద్దరూ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ లో చేరనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆప్ సీఎం అభ్యర్థిగా సిద్దు నే నిలబెట్టే అవకాశాలున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.దీనికి తోడు పంజాబ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సిద్ధు అనడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిస్తుంది.
ఇప్పటికే ఉత్తరాఖండ్,అరుణాచల్ ప్రదేశ్ లలో రాష్ట్రపతి పాలన విధించి తప్పుచేసి సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని చవి చూసిన మోడీ సర్కార్ కి దగ్గర్లో జరగబోయే ఉత్తర ప్రదేశ్,పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి.ఈ తరుణం లో సిద్దు రాజీనామా బీజేపీ ని బలహీన పరుస్తుందనడం లో సందేహం లేదు. అదే టైం లో ఆప్ లో సిద్దు చేరిక కేజ్రీవాల్ కి బలాన్నిస్తుంది. అయితే గత ఎన్నికల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్ సిద్ధూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. కేజ్రీవాల్‌పై కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అయినా సిద్ధూను పార్టీలోకి తీసుకుంటుండడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.