Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Cricketer Nehra will Announce Retirement Soon

By   /  October 11, 2017  /  Comments Off on Cricketer Nehra will Announce Retirement Soon

    Print       Email

సొంతగడ్డపై నెహ్రా రిటైర్మెంట్..!

 

InCorpTaxAct
Suvidha

 

అంతర్జాతీయ క్రికెట్ కు ఆశిష్ నెహ్రా వీడ్కోలు పలికే సమయం దగ్గరపడిందని తెలుస్తుంది. 18 ఏళ్లుగా తన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో టీం ఇండియాకు ఎన్నో గొప్ప విజయాలను అందించిన ఆశిష్ నెహ్రా ఇక తన క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలుకునున్నాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆసిస్ సీరీస్ లో కాకుండా జరుగబోయే న్యూజిల్యాండ్ సీరీస్ లో నెహ్రా క్రికెట్ కు గుడ్ బై చెబుతాడట. భారత్ పర్యటనలో భాగంగా న్యూజిల్యాండ్ నవంబర్ 1న టి20 మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్ లోనే నెహ్రా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సమాచారం.

ప్రత్యేకించి ఆ మ్యాచ్ లోనే ఎందుకు అంటే ఢిల్లిలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో ఆ మ్యాచ్ జరుగనుంది. తన స్వస్థలమైన ఆ మ్యాచ్ లో అభిమానుల మధ్య గొప్ప వీడ్కోలు పలకాలని సిద్ధమయ్యాడు నెహ్రా. ఆసిస్ తో తలపడుతున్న టి20 లో నెహ్రాను ఎంపిక చేయగా టి20 తుది జట్టులో మాత్రం అతనికి స్థానం దక్కలేదు. భువనేశ్వర్, బూమ్రా లతో బౌలింగ్ పటిష్టంగా ఉండగా.. వారు అందుబాటులో లేకుంటే మహమ్మద్ షమి, ఉమేష్ యాదవ్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. జట్టుకి తన సేవలు చాలనుకున్న ఆశిష్ నెహ్రా రిటైర్మెంట్ కు సిద్ధమయ్యాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →