Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

సంగీత సాహిత్య సమలంకృతే

By   /  March 18, 2016  /  Comments Off on సంగీత సాహిత్య సమలంకృతే

    Print       Email
swatikiranamచిత్రం: స్వాతికిరణం(1992)
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం : కె.వి.మహాదేవన్
రచన-సిరివెన్నెల 

చక్కని సాహిత్యానికి అతి చక్కని సంగీతం !

**
సంగీత సాహిత్య సమలంకృతే సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే
సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే
హే భారతి మనసాస్మరామి – హే భారతి మనసాస్మరామి
శ్రీ భారతి శిరసానమామి – శ్రీ బారతి శిరసానమామి
సంగీత సాహిత్య సమలంకృతే…  
వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
నాద నాదాంత పరివేషిని ఆత్మ సంభాషిని
వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
నాద నాదాంత పరివేషిని ఆత్మ సంభాషిని
వ్యాస వాల్మీకి వాగ్దాయిని
వ్యాస వాల్మీకి వాగ్దాయిని జ్ఞానవల్లి సముల్లాసిని
 
సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే
సంగీత సాహిత్య సమలంకృతే
 
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి ఆ ఆ ఆ ఆ ఆ ఆ
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి భవ్య ఫలకారిణి
నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపనీ 
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి భవ్య ఫలకారిణి
నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపనీ సకల సుకళాసమున్వేషిని…
సకల సుకలాసమున్వేషిని సర్వరస భావ సంజీవిని
 
సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే
హే భారతి మనసాస్మరామి
శ్రీ భారతి శిరసానమామి
ఈ పాటను  ఇక్కడ https://www.youtube.com/watch?v=psodkQBzveU వినండి!
*******
కే.వి మహదేవన్ 
mahadevan
సినీవినాలాకాశపు నిండు చంద “మామా “
సాహిత్యాలకు బాణీలిచ్చే ‘స్వర బ్రహ్మ ” కే.వి మహదేవన్
నాద శరీరుడైన ఆ శివుడే సామవేదసారాన్ని ప్రపంచానికి అందించడానికి దివి నుండి భువికి దిగివచ్చాడేమో అని అనిపించే వ్యక్తి మహదేవన్.
మూగ మనసులు , మంచి మనసులు చిత్రాలతో మామా అని పేరు తెచ్చుకున్న ఈ మహదేవన్ మొదటి సినిమ ‘ముందడుగు ‘ ( కోడెకారు చిన్న వాడ వాడి పోనీ వన్నే కాడా )తో తెలుగు సినిమా జగత్తులో మొదటి అడుగు వేశారు.
శ్రీచరణ మందార మధుపమునై వ్రాలి
నిర్మల నిర్వాణ  మధుధారలే గ్రోలి…. 
అంటూ సుదూర తీరాలకు వెళ్ళి పోయినా….ఆయన స్వరపరచిన పాటల ద్వారా ఎల్లప్పుడు మన హృదయాలలోనే ఉన్నారు .
(సేకరణ)
టీవీయస్. శాస్త్రి 
TVS SASTRY
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →