Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

దాశరధి గారి సినీగీతం

By   /  April 16, 2016  /  Comments Off on దాశరధి గారి సినీగీతం

    Print       Email
Dararathi_krishnamacharya
వ్రాయక నిర్మాతలని, వ్రాసి ప్రేక్షకులని ఏడిపించే లబ్ద ప్రతిష్టుడైన శ్రీ ఆచార్య ఆత్రేయ గారు వాగ్దానం చిత్రానికి దర్శకత్వం వహించారు. పాటల రచయితైవుండి కూడా శ్రీశ్రీ, నార్ల చిరంజీవి, దాశరధి వంటి కవుల చేత ఆ చిత్రంలో పాటలు వ్రాయించారు. దాశరధి గారిని ప్రత్యేకంగా పిలిపించుకుని ఈ పాటను రాయించుకున్నారు ఆత్రేయ గారు.  దాశరధి గారి తొలి సినీగీతంగా దీనిని కొంతమంది చెబుతుంటారు!నిజానికి దాశరధి గారి మొదటి సినీ గీతం ‘ఇద్దరు మిత్రులు ‘ చిత్రం లోని ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ …..’ ఏది ఏమైనా పెండ్యాల గారు చక్కగా స్వరపరచిన ఈ గీతాన్ని  ఇక్కడ https://www.youtube.com/watch?v=4xweDYPO0L8 వినండి!
*******
నా కంటిపాపలో నిలిచి పోరా
నీ వెంట లోకాలు గెలువనీరా
ఈనాటి పున్నమి ఏనాటి పున్నెమో
జాబిలి వెలిగేను మన కోసమే
నెయ్యాలలో తలపుటయ్యాలలో
అందుకుందాము అందని ఆకాశమే
ఆ చందమామలో ఆనంద సీమలో
వెన్నల స్నా నాలు చేయుదమా
మేఘాలలో వలపు రాగాలలో
దూర దూరాల స్వర్గాల చేరుదమా
ఈ పూలదారులు ఈ నీలి తారలు
తీయని స్వప్నాల తేలించగా
అందాలను తీపి బంధాలను
అల్లుకుందాము డెందాలు పాలించగా
******
పున్నమి , పున్నెము, వెన్నెల స్నానాలు లాంటి పద ప్రయోగాలు అందరిని ఆకట్టుకున్నాయి.మళ్ళీ ఒకసారి వినండి. ఎంత బాగుంటుందో!
టీవీయస్.శాస్త్రి   
TVS SASTRY
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →