దళితుల తీవ్ర నిరసన.. దేవతల పూజకు దూరం..
ఉనా దుర్ఘటన నేపథ్యంలో దళితులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఎంతలా అంటే.. సమాజంలో మార్పు కోరుతూ వినూత్న తరహాలో నిరసన తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయుధాలు ధరించి కనిపించే దేవతలను పూజించడం మానేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే రాముడు, కృష్ణుడు, శివుడు, దుర్గా దేవి వంటి దేవలను పూజించడం మానుకోవాలనేది వారి ప్రయత్నం. అయితే గణేశుడు, లక్ష్మీదేవి, సరస్వతి దేవీ, కుబేరుడు, సాధువులు వంటి ఆయుధాలు ధరించని దేవతలను మాత్రమే పూజించాలని భావిస్తున్నారు.
ఈ విషయంపై బాబా సాహెబ్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ స్పందించారు. హిందూమతంలో అంతర్మధనం ప్రారంభమైందన్నారు. అంబేద్కర్ చూపించిన దారిలో దళితులు బౌద్ధమతంలోకి మారిపోయారని అన్నారు. గుజరాత్ లో మాత్రం దళితులు మతం మారేందుకు ఇష్టపడటం లేదని చెప్పారు. అయితే వారు హిందూ మతాన్ని పునర్ నిర్వచించేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. హింసకు తావులేకుండా హిందూ మతాన్ని మార్చాలని భావిస్తున్నారని అన్నారు.
దళితులు ఆయుధాలు ధరించిన దేవతల ఫొటోలను తొలగించేందుకు ప్రయత్నించారని తెలిపారు. అయితే ఉద్యమాన్ని ఓ క్రమపద్ధతి ప్రకారం నిర్వహించాలని తాను సూచించానన్నారు. దుర్గానవరాత్రుల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించామన్నారు. త్వరలో ఈ ఉద్యమం యూపీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉందన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.