కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి: దానం నాగేందర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేత దానం నాగేందర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలపై నోరు పారేసుకోవడం సబబు కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీనే ఇచ్చిందని అన్నారు. అలాంటి పార్టీని గలీజ్ పార్టీ అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాఖ్యలు కేవలం అధికార అహంకారంతో కూడుకున్నవేనని అన్నారు. కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదని నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. ఇలాగే మాట్లాడితే తగినవిధంగా బుద్ధి చెబుతామని అన్నారు.
సామాన్యజనం నెల రోజులు కష్టపడి పనిచేస్తే నెలకు గట్టిగా 20 వేలు మాత్రమే సంపాదిస్తున్నారని అన్నారు. అదే కేటీఆర్ ఓ రోజు కష్టపడి ఏడు లక్షలు సంపాదించడం విడ్డూరంగా ఉందని అన్నారు. టీఆర్ ఎస్ నేతలు కూలిపనులు చేయడాన్ని ఓ డ్రామా అంటూ కొట్టిపాడేశారు. కేటీఆర్ ఐస్ క్రీమ్ అమ్మిన చోటు తాము కూడా అమ్ముతామని అన్నారు. తమకు కూడా అదే రకంగా కూలి ఇవ్వకపోతే ఆ షాపు ముందు బైఠాయిస్తామని అన్నారు.టీఆర్ఎస్ ప్లీనరీకి ఎవరు డబ్బులు ఇస్తున్నారో తమ దగ్గర లిస్ట్ ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వారి పనిపడతామని అన్నారు. ఏప్రిల్ 17న ట్యాంక్ బండ్ పై తాము తలబెట్టిన నిరసన ప్రదర్శనను శాంతియుతంగా చేస్తామన్నారు. తమ ప్రదర్శనకు పోలీసులు అనుమతి ఇవ్వాలని కోరారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.