Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Dasara is celebrated in a big way…..

By   /  October 9, 2016  /  Comments Off on Dasara is celebrated in a big way…..

    Print       Email

durga-deviవిజ‌యీ భ‌వ‌!

 

InCorpTaxAct
Suvidha

 

 

భార‌తీయులు జ‌రుపుకొనే అతి ముఖ్య‌మైన పండుగ‌ల్లో ద‌స‌ర ఒక‌టి. దసరా అంటేనే సరదాలు, సంప్రదాయాలు, ఆటపాటలు, వినోదాలు మేళవించిన పండుగ. దసరా పండుగను ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుంచి శుద్ధ నవమి వరకు తొమ్మిదిరోజుల పాటు జరుపుకుంటారు. తొమ్మిది రోజులను నవరాత్రులుగా, పదవ రోజును విజయదశమి కలిపి దసరాగా అభివర్ణిస్తారు. విజయదశమి విజయాన్ని సాధించాలన్న ఆకాంక్షను సూచిస్తుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు దరించటం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సంద‌ర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన నేప‌థ్య‌లో 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జ‌రుపుకుంటారు. కాగా దసరా రోజుల్లో అమ్మవారిని భ‌క్తులు వివిధ రూపాలలో కొలుస్తారు. ఆ రూపాలన్నీ ఆయా సంపదలను లేదా ఆయా విజయాలను సూచిస్తాయి.

తెలంగాణ‌లో ద‌స‌రా ఉత్స‌వాలు

తెలంగాణా ప్రజలు దసరాసమయంలో బతుకమ్మ ఉత్సవాలు చేస్తారు. బతుకమ్మ పండుగ’ తెలంగాణా రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. నవరాత్రి మొదట రోజున బతుకమ్మను పూలతో అలంకరించి తొమ్మిది రోజులు ఒక చోట స్త్రీలంతా చేరి ఆటపాటలు పాడి ఆనందిస్తారు. చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేసిన తరువాత పండుగ చేసుకుంటారు. ఇది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుంటారు. ఈ వారం రోజులలో వీరు రోజూ చిన్న బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం దాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో…

ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారికి రోజుకో అలంకారం చేసి పూజలు నిర్వహిస్తారు. అయితే కొన్ని జిల్లాలు దసరా ఉత్సవ విషయంలో తమదైన ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో దసరా ఉత్సవాలలో భాగంగా కళారాలను ఊరేగిస్తారు. వీటిని చక్కగా అలంకరించి సిద్ధం చేస్తారు. ఇక్కడ కాళికాదేవికి, మహిషాసుర మ‌ర్ధినికి, నరసింహస్వామికి కళారాలున్నాయి. వీటికి ఈ తొమ్మిది రోజులు విశేషంగా పూజలు చేసి ఊరేగిస్తారు. కళారాన్ని బండి మీద ఎక్కించి కొయ్యలను అమర్చి వాటి సాయంతో కళారాన్ని ఊపుతూ డప్పుల మోతతో ఊరేగిస్తారు. ఊరి నడిమధ్యకు తీసుకువచ్చి అక్కడ రాక్షస సంహారం ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. విజయనగరంలో దసరా సమయంలో పైడి తల్లి పూజలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా అడవి నుంచి ఒక చెట్టును నరికి తీసుకొచ్చి మొదలు భాగాన్ని లాగుడు బండికి కట్టి చివరి భాగంలో ఊయల కట్టి అందులో పూజారిని కూర్చోబెట్టి ఊరేగిస్తారు. ఈ ఉత్సవం చూసేందుకు చుట్టుపక్కల పల్లెటూళ్ల నుంచి ప్రజలు ఎడ్లబండిలో వచ్చి రోడ్ల పక్కన గుడారాలు వేసుకొని ఉత్సవం చూసి ఆనందిస్తారు. దసరా రోజుల్లో బొమ్మల కొలువులు పెట్టడం ఓ సరదా. ఇలా కొన్ని జిల్లాల్లో దసరా ఉత్సవాలను తమదైన ప్రత్యేక శైలిలో జరుపుకుంటుంటారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →