Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Dasari Narayana Rao- Kapu – AP

By   /  June 14, 2016  /  Comments Off on Dasari Narayana Rao- Kapu – AP

    Print       Email

dasariవంగ‌వీటిని కోల్పోయి బాధ‌ప‌డుతున్నాం

 

InCorpTaxAct
Suvidha

 

 

కాపుల‌ను బీసీల్లో చేర్చాల‌ని కోర‌డం అనేది ఒక‌ సామాజిక స‌మ‌స్య అని, దాన్ని ఉగ్ర‌వాద స‌మ‌స్య‌గా ప్ర‌భుత్వం చిత్రీక‌రించ‌డం చాలా బాధ‌క‌ర‌మ‌ని మాజీ కేంద్ర మంత్రి, ద‌ర్శ‌క నిర్మాత దాస‌రి నారాయ‌ణ‌రావు అన్నారు. గ‌తంలో కాపుల‌కు పెద్ద దిక్కుగా ఉన్న కాపు నాయ‌కుడు వంగ‌వీటి మోహ‌న రంగాను పోగొట్టుకుని బాధ‌ప‌డుతున్నామ‌ని, మ‌ళ్లీ అదే త‌ప్పు చేసి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంను కూడా పోగొట్టుకునే ప‌రిస్థితి తెచ్చుకోమ‌ని దాస‌రి స్ప‌ష్టం చేశారు. ముద్ర‌గ‌డ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్న నేప‌థ్యంలో అన్ని పార్టీల‌కు చెందిన కాపు నాయ‌కులంతా సోమ‌వారం రాత్రి పార్క్ హ‌య‌త్ హోట‌ల్  స‌మావేశ‌మైన  అనంత‌రం వారు మీడియాతో మాట్లాడారు. కాపు సోదర సోదరీమణులను అరెస్టుచేసి పోలీసుస్టేషన్లో పెట్టడం, అక్కడ కూడా జామర్లు పెట్టడం, ముద్రగడను చేర్పించిన రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో కూడా జామర్లు పెట్టి ఆయనతో ఎవరినీ మాట్లాడనివ్వకపోవడం.. ఎక్కడా ఇంతవరకు జరగలేదని దాసరి మండిపడ్డారు. ఇదంతా చూస్తుంటే అసలు మనం ఏపీలో ఉన్నామా, పాకిస్తాన్‌లో ఉన్నామా అనే వాతావరణం తూర్పుగోదావరిలో కనిపిస్తోందని, ఇది చాలా బాధాకరమని అన్నారు.

ఈ విషయాలను కవర్ చేస్తున్న మీడియాను కట్ చేసేస్తున్నారని, ఇది ప్ర‌జా స్వామ్యంలో స‌హించ‌రాని నేర‌మ‌న్నారు. కాపునేతలపై కాపు మంత్రులే బురద జల్లే పనిలో ఉన్నార‌ని,  ఉద్యమాన్ని సమర్థిస్తూ మాట్లాడే వారిపై ఏ రకంగా బురద జల్లించాలని ప్లాన్‌‌లు చేస్తున్నార‌ని, ఇది మంచిప‌ద్ధ‌తి కాద‌ని దాస‌రి అన్నారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ మంచిది కాదని మంత్రులకు హితవు పలికారు. మాలో మాకే గొడవలు పెట్టి మమ్మల్ని విడదీయాలనే ప్రయత్నం చేయడం సబబు కాదని ఆయన హెచ్చరించారు. ఇలా బురదజల్లే కార్యక్రమాలు కానీ ప్రారంభిస్తే మా దగ్గర మీకు సంబంధించి పెద్ద బురదే ఉంది మొత్తం బయట పెడతామన్నట్లుగా దాసరి చెప్పుకొచ్చారు. కాపు మంత్రులంతా జాగ్రత్తగా ఉండాల‌న్నారు.  ప్ర‌భుత్వం కాపుల సంబంధించిన విష‌యాల‌పై రెండురోజుల్లో స్పందించాల‌ని లేక‌పోతే భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని హెచ్చ‌రించారు. కార్య‌క్ర‌మంలో దాస‌రితో పాటు చిరంజీవి,  బొత్స, పళ్లంరాజు, సి రామచంద్రయ్య పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →