కామెరూన్ కు బంపర్ ఆఫర్..!
బ్రిటన్ ప్రజలు బ్రెగ్జిట్ వైపు మొగ్గుచూడంతో డేవిడ్ కామెరూన్ మనస్తాపానికి గురయ్యారు. తన ప్రధాని పదవికి రాజీనామా చేసేశారు. ఇప్పుడు ఆయనకు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. కజకిస్థాన్ లో ఉద్యోగం చేస్తే ఏడాదికి ఏకంగా 32 మిలియన్ పౌండ్లు జీతం ఇస్తామని ఆ దేశం ఆఫర్ చేసింది. దీని విలువ ఏకంగా రూ. 314.49 కోట్లు అన్నమాట. ఇంతకీ ఆ ఉద్యోగం ఏంటంటే.. కామెరూన్ కజకిస్థాన్ సుల్తాన్ గా ఉండాలి. అయితే ఈ ఉద్యోగం కోసం ఓ కండీషన్ కూడా పెట్టింది. సుల్తాన్ లా ఉండాలంటే కామెరూన్ సున్తీ చేయించుకోవాలట. ఈ ఆఫర్ ని డైరెక్ట్ గా కామెరూన్ ఆఫీసుకే పంపిచారు ఆ దేశ అధికారులు.
కజకిస్థాన్ ముస్లీం యూనియన్ కంట్రీ. ఈ దేశం గతంలో కూడా ఇలాంటి వ్యంగ్యమైన ఆఫర్లతో వార్తల్లోకి ఎక్కింది. ఆ దేశ పాలకుడు 76 ఏళ్ళ మురాత్ తెలిబెకోవ్ ఓ నియంత. ఈయన ఇలాంటి వ్యంగ్యమైన వ్యాఖ్యలతో మీడియా దృష్టిని తనవైపుకు తిప్పుకుంటూ ఉంటారు. దేశాధ్యక్షుడి వయసు 80 ఏళ్ళు దాటితే ఉరితీయాలని.. లంచాన్ని చట్టబద్ధం చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. కామెరూన్ ప్రస్తుత వేతనం 74 వేల పౌండ్లు మాత్రమే. కాబట్టి ఆయన ఈ బంపర్ ఆఫర్ ఒకే చేస్తే బాగుంటుందని ఆయన ప్రత్యర్ధులు చలోక్తులు విసురుతున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.