Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

David Warner issues tearful apology and accepts his Australia career may be over

By   /  April 1, 2018  /  Comments Off on David Warner issues tearful apology and accepts his Australia career may be over

    Print       Email

ఇక క్రికెట్ ఆడ‌క‌పోవ‌చ్చు

InCorpTaxAct
Suvidha

 

 

* దేశం ప‌రువు తీశామ‌నే బాధ ఎక్కువ‌గా ఉంది

* క్ష‌మించాల‌ని అందరినీ కోరుతున్న‌

* డేవిడ్ వార్న‌ర్‌

* వార్న‌ర్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న టీంమిండియా క్రికెట‌ర్లు

డెక్క‌న్ అబ్రాడ్‌: బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో డేవిడ్ వార్నర్ సహా స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డేవిడ్ వార్న‌ర్ మీడియాతో మాట్లాడుతూ ఉద్వేగానికి లోన‌య్యారు. 12 నెలల నిషేధం తర్వాత తాను ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడకపోవచ్చని కన్నీటి పర్యంతమయ్యాడు. తాను చేసిన పని క్షమించరానిదన్నాడు. ‘‘నిషేధం తర్వాత ఏదో ఒక రోజు మళ్లీ జట్టుకు ఆడే గౌరవం దక్కుతుందన్న చిన్న ఆశ ఉంది. కానీ, నిజానికి నేను మళ్లీ క్రికెట్ ఆడకుండా తప్పుకొంటాను’’ అని వార్నర్ అన్నాడు. ఓ కఠినమైన మార్పు కోసం నిపుణుల సలహా తీసుకుంటానని, ఆ తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పాడు. దేశం పరువు తీసే పని చేశామని, తీసుకున్న ఓ చెత్త నిర్ణయంలో తన హస్తమూ ఉందని చెప్పాడు. అలాంటి పని వల్ల నేడు ఇక్కడ ఇలా మట్లాడాల్సి రావడం విచారకరమని వ్యాఖ్యానించాడు.

అయితే వార్న‌ర్‌కు టీమిండియా క్రికెట‌ర్లు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్లకి మద్దతుగా తొలిసారి హర్భజన్ సింగ్ మాట్లాడాడు. ‘బాల్ టాంపరింగ్‌కి ఏడాది నిషేధమా..? ఇది ఓ జోక్. వాళ్లు ఎలాంటి నేరానికి పాల్పడ్డారు..? ఏడాదిపాటు ఒక క్రికెటర్‌ని ఆటకి దూరం చేయడం అర్థరహితం. ఒకవేళ నిషేధం వేయాలనుకుంటే ఒక టెస్టు సిరీస్ లేదా రెండింటో సరిపెట్టండి. అంతేకానీ.. ఇలా 12 నెలలు ఆటకి దూరం చేయడం హాస్యాస్పదం..!’ అని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. యువ‌రాజ్ సింగ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ… ‘మనమందరం పొర‌పాట్లు చేస్తాం… స్మిత్‌ కూడా తప్పు చేశాడని మనకు తెలుసు. వాటి పర్యవసానాలు అతడు అనుభవిస్తాడు. ఈ ఒక్క సంఘటన వల్ల… అతడు గొప్ప బ్యాట్స్‌మ్యాన్, మంచి మనిషి అన్న విషయాన్ని. . మనం మరచిపోకూడదు. ఆస్ట్రేలియా క్రికెట్‌కు వన్నె తెచ్చిన… అతడి గౌరవాన్ని తగ్గించకూడదు’ అని పేర్కొన్నాడు. టాంపరింగ్‌ చేసిన వారిలో… స్మిత్‌ మొదటివాడు కాదన్న విషయం గుర్తించాలన్నాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →