Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Dejected Uma Madhava Reddy to quit TDP

By   /  July 22, 2016  /  Comments Off on Dejected Uma Madhava Reddy to quit TDP

    Print       Email

uma madhavareddyటీడీపీకి `ఉమా` గుడ్ బై

 

InCorpTaxAct
Suvidha

 

 

జాతీయ పార్టీగా ఎద‌గాల‌నుకుంటున్న తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ‌లు త‌గులుతూనే ఉన్నాయి. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చ‌క్రం తిప్పిన టీడీపీ రాష్ట్రం విడిపోయాక కూడా తెలుగు రాష్ట్రాల్లో బ‌లంగానే ఉన్న‌ట్లుక‌నిపించింది. అయితే 2014 ఎన్నిక‌ల త‌ర్వాత తెలంగాణ‌లో అధికారం రాక‌పోయే స‌రికి ఆ పార్టీ నుంచి ఒక‌రొక‌రుగా వెళ్లిపోవ‌డం మొద‌లు పెట్టారు. అయితే పార్టీ మార‌డంలో  ప్ర‌స్తుతం గెలిచిన ఎమ్మెల్యేల బాట‌లోనే మాజీలు కూడా న‌డుస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధ‌వ‌రెడ్డి కూడా టీడీపీ వ‌దిలిపెట్టారు.  అయితే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ అస్థిత్వమే ప్రశ్నార్థకంగా మారింద‌ని, దీంతో ఉమా మాధవ రెడ్డిని పట్టించుకునే నాథుడు టీడీపీలో క‌రువైన‌ట్లు స‌మాచారం. దీంతో గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఉమా.. టీ టీడీపీలో తనకు భవిష్యత్తు లేదని పార్టీ మారటమే ఉత్తమమని అని డిసైడయ్యారట. అయితే టీఆర్ ఎస్ వైపు చూసినా.. అక్కడి నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాకపోవడం పైగా నల్లగొండలో టీఆర్ ఎస్ కు నాయకులు చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉండడంతో ఇప్పుడు ఆమె చూపు హస్తం నేతల వైపు మళ్లిందని సమాచారం.

మరోపక్క – కాంగ్రెస్ కు నల్లగొండలో ముఖ్యంగా భువనగిరిలో జెండాను కాపాడే నాయకులు కరువయ్యారు. దీంతో సీనియర్ కాంగ్రెస్ నేత  జానారెడ్డి.. ఉమాకు ఆఫర్ ఇచ్చారని తెలిసింది. దీంతో ఆమె సైకిల్ దిగి హస్తం అందుకోవాలని సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే జానా-ఉమా మధ్య చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని తమ అధినేత చంద్రబాబుకు చెప్పి పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారట ఆమె. ఇదే గనుక జరిగితే.. భువనగిరిలో టీడీపీ అడ్రస్ గల్లంతయినట్టే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →