కేజ్రీవాల్ భార్య మరో రబ్రీ కాబోతున్నారా?
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భార్య సునీత యసునీత భర్త బాటలోనే నడుస్తున్నారు. అన్నీ ఆయన కోసమే అంటున్నారు. అంతేకాదు అత్యున్నత సర్వీసుగా పరిగణిస్తున్న ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)కు సైతం స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)తీసుకున్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది. సునీత కేజ్రీవాల్ రాజకీయ వారసురాలు కానున్నట్లు ఊహాగానాలు తలెత్తుతున్నాయి. కేజ్రీవాల్ కూడా తొలుత ఐఆర్ఎస్ సర్వీసుకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చేశారు. తాజాగా ఆయన సతీమణి సునీత కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. పలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో సునీత వీఆర్ఎస్ను ప్రస్తావిస్తూ నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి కేసుల్లో ఇరుక్కోగా తనకు దక్కిన సీఎం పీఠంపై ఆయన తన సతీమణి రబ్రీ దేవిని కూర్చోబెట్టారు. ఈ ఉదంతాన్ని గుర్తు చేసిన పలువురు నెటిజన్లు సునీతను కూడా ఢిల్లీ రబ్రీ దేవిగా అభివర్ణించారు.
కొందరైతే… సునీతను చదువుకున్న రబ్రీ దేవిగా అభివర్ణిం చారు. ఢిల్లీ సీఎం పదవిని సునీతకు వదిలేయనున్న కేజ్రీవాల్ పంజాబ్, గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రి అభ్యర్థి కానున్నారని కథనాలు వెలువడ్డాయి. లేకపోతే, సునీతనే ఆయా రాష్ట్రాలలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దింపనున్నట్లు కూడా చెబుతున్నారు. మరికొందరైతే ఆమెను రాజ్యసభకు పంపేందుకే ఉద్యోగానికి కేజ్రీ రాజీ నామా చేయించారని కామెంట్ చేశారు. ఇక వారసత్వ రాజకీయాలకు వ్య తిరేకమని ప్రకటించిన ఆప్ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి పదవులు ఎలా దక్కుతాయంటూ ప్రశ్నలు సంధించారు. అయితే ఆమె రాజకీయాల్లోకి రారని ఆప్ స్పష్టం చేసింది. ఏది ఏమైనా ఆమె పదవీ విరమణ పెద్ద చర్చకు దారి తీసింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.