Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Devi Sri Prasad is OUT of ‘Gautamiputra Satakarni’

By   /  August 10, 2016  /  Comments Off on Devi Sri Prasad is OUT of ‘Gautamiputra Satakarni’

    Print       Email

balakrishnaబాలయ్య సినిమా నుంచి దేవిశ్రీ ఔట్..?

 

InCorpTaxAct
Suvidha

 

 

నందమూరి అందగాడు బాలయ్య తన వందో చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వందో చిత్రంగా చారిత్రక కథనం అయినా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ని ఎంచుకున్నారు. దీనికి ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి బాలయ్య చిత్రాన్ని బరిలో నిలపాలని మూవీ యూనిట్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
అంతా అనుకున్న విధంగా సాగుతున్నా.. సంగీతం అందించే కార్యక్రమం మాత్రం ఇంకా ప్రారంభం కాలేదని ఫిల్మ్ నగర్ టాక్.ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇప్పటివరకు కనీసం ఒక్కపాట కూడా రికార్డ్ చేయలేదట. దీంతో క్రిష్ .. త్వరగా పూర్తి చేయాలంటూ తీవ్రమైన ఒత్తిడి చేశారట.

అయితే.. దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం కొన్ని తమిళ చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. దీంతో తనకు మరికొంత సమయం కావాలని కోరుతున్నారట. కాని క్రిష్ మాత్రం ఒప్పుకోలేదని సమాచారం.ఈ కారణంగా దేవిశ్రీ ప్రసాద్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాని ఎలాగైనా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని క్రిష్, బాలయ్య భావిస్తున్నారు. మరి వారు ఊహించిన విధంగా రిలీజ్ అవ్వాలంటే తక్కువ సమయంలో మంచి మ్యూజిక్ అందించే సంగీత దర్శకుడు వారికి దొరకాలి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కాస్తంత వేచి చూడాల్సిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →