Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Devineni Nehru is eyeing on TDP!!

By   /  August 4, 2016  /  Comments Off on Devineni Nehru is eyeing on TDP!!

    Print       Email

devineni nehruదేవినేని చూపు..టీడీపీ వైపు?

 

InCorpTaxAct
Suvidha

 

 

విజ‌య‌వాడ‌లో కీల‌క నేత‌గా ఉన్న దేవినేని నెహ్రూ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారా? త‌న పాత గూటికి చేరేందుకు స‌న్నాహాలు చేస్తున్నారా? త‌్వ‌ర‌లోనే టీడీపీలో చేర‌బోతున్నారా? అంటే అవున‌నే అంటున్నారు విజ‌య‌వాడ ప్ర‌జ‌లు. కృష్ణ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద‌దిక్కుగా ఉన్న దేవినేని నెహ్రూ త్వ‌ర‌లోనే ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చేస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. కాగా పవర్ లో లేకున్నా పవర్ ఫుల్ నేతగా ఉన్న దేవినేని నెహ్రూ టీడీపీ వైపు చూస్తున్న విషయం వాస్తవమేనని ఆయన అనుచరులు చెబుతున్నారు. గతంలో టీడీపీలోనే ఉన్న ఆయన పార్టీ చీలిక నేపథ్యంలో ఎన్టీఆర్ తరఫున నిలిచారు. ఆ తర్వాత  కాంగ్రెస్ లో చేరిపోయారు. నాటి నుంచి ఆయన అదే పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రాభవం కొడిగడుతుండటం నెహ్రూను డైలమాలో పడేసింది. ఈ నేపథ్యంలో తన పాత గూటికి చేరేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారట.

ఇక అదే జిల్లాకు చెందిన మరో సీనియర్ రాజకీయవేత్త – కాంగ్రెస్ పార్టీకే చెందిన బూరగడ్డ వేదవ్యాస్ కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓసారి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన వేదవ్యాస్ రెండు రాష్ట్రాల ప్రజలకు చిరపరచితులే. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో కొద్దికాలం ఉన్నా ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు కాస్తంత దూరంగా ఉంటున్న వేదవ్యాస్ తిరిగి యాక్టివేట్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన వీరిద్దరూ టీడీపీలో చేరితే కృష్ణా జిల్లా టీడీపీకి మరింత బలమొస్తుందని అంటున్నారు. అదే సమయంలో దేవినేని చేరికతో పార్టీలో అంతర్గత కలహాలు కూడా పెరుగుతాయని భయపడుతున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →