Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Dhawan’s fifty leads India to win over Bangladesh in T20

By   /  March 8, 2018  /  Comments Off on Dhawan’s fifty leads India to win over Bangladesh in T20

    Print       Email

బంగ్లాదేశ్‌పై భార‌త్ విజ‌యం

InCorpTaxAct
Suvidha

 

 

 

* రాణించి శిఖ‌ర్ ధావ‌న్‌
* టి-20లో భార‌త్ బోణి
డెక్క‌న్ అబ్రాడ్‌: టి-20లో భార‌త్ బోణి చేసింది. బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. ముక్కోణపు టీ-20 టోర్నీలో భాగంగా
ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్‌లో ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో టీమిండియా క్రికెటర్లు రాణించడంతో నాలుగు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత భారత్ టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. ఈ జట్టులో సౌమ్యా సర్కార్ 12 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఒక బౌండరీతో 14 పరుగులు చేసి ఉనద్కత్ బౌలింగ్‌లో యజువేంద్ర చాహల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. తమీమ్ ఇక్బాల్ 16 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 15 పరుగులు చేసి ఎస్‌.ఎన్‌కూర్ బౌలింగ్‌లో ఉనద్కత్‌కు క్యాచ్ ఇచ్చాడు. వికెట్ కీపర్ ముస్‌ఫికర్ రహీమ్ 14 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, రెండు బౌండరీల సహాయంతో 18 పరుగులు చేసి విజయ్ శంకర్ బౌలింగ్‌లో కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. కెప్టెన్ మహ్మదుల్లా ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక పరుగులు మాత్రమే చేసి విజయ్ శంకర్ బౌలింగ్‌లో ఎస్ఎన్ కూర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు వెళ్లాడు. లిటోన్ దాస్ 30 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలతో 34 పరుగులు చేసి చాహల్ బౌలింగ్‌లో సురేష్ రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. మెహిదీ హసన్ నాలుగు బంతులు ఎదుర్కొని మూడు పరుగులు చేసి ఉనద్కత్ బౌలింగ్‌లో మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చాడు. షబ్బీర్ రహ్మాన్ 26 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మూడు బౌండరీల సహాయంతో 30 పరుగులు చేసి ఉనద్కత్ బౌలింగ్‌లో కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. రుబెల్ హొసైన్ ఒక బంతిని ఎదుర్కొని రనౌట్ అయ్యాడు.
భారత జట్టులో జయదేవ్ ఉనద్కత్ నాలుగు ఓవర్లలో 38 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. విజయ్ శంకర్ నాలుగు ఓవర్లలో 32 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు. శార్దూల్ ఠాకూర్ నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి ఒక వికెట్, యుజువేంద్ర చాహల్ నాలుగు ఓవర్లలో 19 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ప్రత్యర్థి తన ముందు ఉంచిన 140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ 18.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.
కెప్టెన్ రోహిత్ శర్మ 13 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలతో 17 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. సురేష్ రైనా 27 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఒక బౌండరీతో 28 పరుగులు చేసి రూబెల్ బౌలింగ్‌లో మెహిదీ హసన్‌కు క్యాచ్ ఇచ్చాడు. శిఖర్ ధావన్ మళ్లీ తన బ్యాట్‌ను ఝళిపించాడు. ధావన్ 43 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, ఐదు బౌండరీల సహాయంతో 55 పరుగులు చేసి, తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో లిటోన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. మనీష్ పాండే 19 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలతో 27 పరుగులు, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ రెండు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
బంగ్లాదేశ్ జట్టులో రూబెల్ హోసన్ 3.4 ఓవర్లలో 24 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ముస్త్ఫాజుర్ రహ్మాన్ నాలుగు ఓవర్లలో 31 పరుగులిచ్చి ఒక వికెట్, తస్కిన్ అహ్మద్ మూడు ఓవర్లలో 28 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు. ట్రై సిరీస్‌లో భారత్ శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌ను కోల్పోయినా రెండో మ్యాచ్‌లో విజయగర్వంతో మూడో మ్యాచ్‌పై దృష్టి సారించింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →