ధోనిలో అంత సత్తా లేదా?
భారత జట్టు కెప్టెన్‌గా.. ఉత్తమ కీపర్‌గా.. మిస్టర్ కూల్‌గా ఎన్నో విజయాలను అందించిన మహేందర్ సింగ్ ధోనిలో ఇప్పుడు ఆ సత్తాలేదా? అందుకనే ఆడలేక పోతున్నాడా? అతన్ని ఎక్కువ కాలం కెప్టెన్‌గా కొనసాగించడం అంత మంచిది కాదా? అనే ప్రశ్నలకు గంగూలి చెప్పిన మాటలు వింటే అవుననే అనక తప్పడం లేదు. ధోనిపై మాజీ కెప్టెన్ గంగూలి కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు. కొన్ని సూచనలు చేశారు.. అవేంటో చూడండి… రాబోయే వన్డే ప్రపంచకప్ వరకు ధోనీని కెప్టెన్‌గా కొనసాగించాలా వద్దా అనే దానిపై సెలెక్టర్లు దృష్టి సారించాలని దాదా అన్నాడు. తొమ్మిదేండ్లుగా ధోనీ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు, ఇది సుధీర్ఘ సమయం. కెప్టెన్‌గా అతను జాతీయ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలందించాడు. కానీ రానున్న నాలుగేండ్లు జట్టును నడిపించే సామర్థ్యం ధోనీలో మిగిలుందా అనేది సెలెక్టర్లు ఓసారి ఆలోచించాలి.
ఎందుకంటే ఇప్పటికే టెస్ట్‌లకు దూరమై, వన్డే, టీ20లకు పరిమితమైన మహీ 2019 వన్డే ప్రపంచకప్‌లో జట్టును ముందుండి నడిపించగలడా అన్న దానికి సరైన సమాధానం వెతకాలి. ఒక వేళ ధోనీ వల్ల కాదనుకుంటే కొత్త కెప్టెన్‌ను వెతికే పనిలో పడాలి, లేకుంటే అతన్నే కొనసాగిద్దామనుకుంటే అంతకుమించిన ఆశ్చర్యకర నిర్ణయం మరొకటి ఉండదు. ప్రపంచంలోని ప్రతి జట్టు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రచించుకుంటున్నాయి. అదే రీతిలో మన సెలెక్టర్ల ఆలోచన శైలి ఉండాలి అని గంగూలీ అన్నాడు. ధోనీ నాయకత్వ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గంగూలీ..టెస్ట్ కెప్టెన్ కోహ్లీని మాత్రం ప్రశంసల్లో ముంచెత్తాడు. మరి గంగూలీ వ్యాఖ్యలపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.