Loading...
You are here:  Home  >  Movies  >  Bollywood  >  Current Article

Dhoni sharing his sweet memories

By   /  July 13, 2016  /  Comments Off on Dhoni sharing his sweet memories

    Print       Email

dhoniధోనీ తొలి ప్రేమ.. కొన్ని జ్ఞాప‌కాలు!

 

InCorpTaxAct
Suvidha

 

 

మిస్ట‌ర్ కూల్‌గా పేరొందిన టీమిండియా కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని గుండెలో దాగి ఉన్న పెద్ద బ‌డ‌భాగ్ని ఏంటి? ఆయ‌న అంత కూల్‌గా ఉండ‌డానికి అదే కార‌ణ‌మా?  ధోనీ గురించి అభిమానుల‌కు తెలిసింది కొంతేనా..?  అంటే అవున‌నే చెప్పాల్సి వ‌స్తోంది.  మ‌హీ గురించి తెలియ‌ని చాలా విష‌యాలు మహీ బయోపిక్‌ ‘ఎంఎస్‌ ధోనీ’ సినిమా ద్వారా వెలుగులోకి రానుంది.  ధోనీ ఓ భగ్న ప్రేమికుడనే విషయాన్ని ప్రపంచానికి చెప్పనుంది. ధోనీ.. 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు టీమిండియాలో చోటు దక్కించుకోవాలని తీవ్రంగా శ్రమించేవాడు. ఈ సమయంలో ‘ప్రియాంక ఝా’ అనే అమ్మాయితో మహీ ప్రేమలో పడ్డాడట. ఆమే తన జీవిత భాగస్వామి అని ఫిక్సయిపోయాడని సినిమాకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. 2003-04లో జింబాబ్వే, కెన్యాల్లో పర్యటించే భారత-ఎకు ధోనీ ఎంపికయ్యాడు. కెన్యా, పాకిస్థాన్‌తో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో విశ్వరూపం చూపిన మహీ.. భారత జట్టు కెప్టెన్‌ గంగూలీ, రవిశాస్త్రీ దృష్టిని ఆకర్షించాడు.

కెరీర్‌ పరంగా ధోనీకి ఆ పర్యటన బాగా కలిసొచ్చింది. కానీ ఇంటికి తిరిగి వచ్చే సరికి గుండె పగిలే నిజం తెలిసింది. తాను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి.. ప్రమాదంలో మరణించిందనే వార్త తెలుసుకుని ధోనీ కదిలిపోయాడు. ఏడాదిపాటు మహీ ఆ అమ్మాయి జ్ఞాపకాల్లోనే గడిపాడట. తెలిసిన వారంతా అతనిక మామూలు మనిషి కాలేడని బాధపడేవారట. కానీ ఆ విషాద జ్ఞాపకాల్లోంచి ధోనీ బయటకు వచ్చాడు.. అసాధారణ ఆటతో టీమిండియాలో చోటు సంపాదించాడు. ఎన్నో రికార్డులు సృష్టించి దేశం గర్వించే క్రికెటర్‌గా ఎదిగాడు. ఇలా ధోనీ గురించి బాహ్య ప్రపంచానికి తెలియని మరిన్ని ఆసక్తికర విషయాలు బయోపిక్‌తో వెలుగులోకి రానున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →