స్టన్నింగ్ లుక్ లో చెర్రీ..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘ధృవ’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎన్.వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని స్వాతంత్య్ర దినోత్సవం వేళ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో చెర్రీ స్టన్నింగ్ లుక్ తో అదిరిపోయేలా కనిపిస్తున్నాడు. అల్లు అరవింద్ – సురేందర్ రెడ్డి – రామ్ చరణ్ కాంబినేషన్ వల్ల ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో చెర్రీ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడని సమాచారం.
తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘తనిఒరువన్ ‘చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ప్రముఖ నటుడు అరవింద స్వామి పాత్ర సినిమాకి హైలెట్ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా నిర్మాతలు మాట్లాడారు. ‘స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఫస్ట్ లుక్ విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం తమ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోందన్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో సినిమాని నిర్మిస్తున్నామన్నారు. అందువల్ల రామ్ చరణ్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తన బాడీ లాంగ్వేజ్, లుక్స్ మార్చుకున్నారని తెలిపారు. ఈ చిత్రంలోని నటీనటులు: రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి . ఈ సినిమాకి సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రాఫర్ – అసీమ్ మిశ్రా, మ్యూజిక్ – హిప్ హాప్ ఆది, ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్, ఆర్ట్ – నాగేంద్ర, ఎడిటర్ – నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ – అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్, దర్శకుడు – సురేందర్ రెడ్డి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.