Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Did Chandra babu beg journalist ABK Prasad?

By   /  August 18, 2016  /  Comments Off on Did Chandra babu beg journalist ABK Prasad?

    Print       Email

chandrababuనిజంగా బాబు వాళ్ల కాళ్లా వేళ్లా ప‌డ్డారా?

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు ఏబీకే ప్ర‌సాద్‌ను ఏపీ సీఎం చంద్ర‌బాబు ఉన్మాదితో పోల్చ‌డంపై పెద్ద దుమార‌మే రేపుతోంది. రాజ‌ధాని అమ‌రావ‌తిలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని కోర్టుకు వెళ్ల‌డం త‌ప్పా అని ఏబీకే ప్ర‌శ్నిస్తుంటే.. కోర్టుకు వెళ్లిన వారు ఖ‌చ్చితంగా ఉన్మాదే అంటూ చంద్ర‌బాబు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఏబీకే ప్ర‌సాద్ ఓ ప్ర‌ముఖ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బాబును తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు. చంద్రబాబు అక్రమాస్తులపై గతంలో తెహల్కా పత్రికలో కథనాలు వస్తే చంద్ర‌బాబు వెళ్లి వారిని కాళ్లావేళ్లా బతిమలాడుకుని ఆపించారంటూ సంచలన కామెంట్లు చేశారు.  ఇంకా ఏబీకే ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే.. “నేను సాక్షి ఉద్యోగిని కాదు. వారం వారం రాసే వ్యాసాలకు ఇచ్చే గౌరవవేతనం తప్ప ప్రస్తుతం నాకు ఎలాంటి ఆదాయ వనరు లేదు. సుప్రీంలో పిటిషన్ వేయడం వెనుక రాజకీయ అండదండలున్నాయన్న ఆరోపణలు అవాస్త‌వం.  పిటిషన్ ను విచారణకు స్వీకరించాలా వద్దా అన్న దశలో పెద్దగా ఖర్చు ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి. పిటిషన్ వేసినందుకు అయిన 10వేల రూపాయల ఖర్చును సుప్రీం కోర్టు న్యాయవాది శ్రవణ్ భరించారు. సుప్రీం తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్తాం. నాపై ఆరోపణలు చేసిన వాళ్లలో ఒకతను ఒకప్పుడు సైకిల్ మీద వచ్చిపోతూ నా కింద ప‌నిచేసిన వ్య‌క్తే“ అంటూ ఏబీకే ప్ర‌సాద్ ఓ మీడియా సంస్థ అధినేతపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

చంద్రబాబు ఇంతకుముందు ప‌రిపాల‌న‌ల్లోకూడా  సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలను తాను వ్య‌తిరేకించాన‌ని ఏబీకే అన్నారు. అప్పుడు కూడా తనను టార్గెట్ చేశారని.. కానీ అప్పటి నిర్ణయాల ఫలితంగా  ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో అందరికీ తెలిసిన విఫయమేనన్నారు. చంద్రబాబు అక్రమార్జనపైనా ఏబీకే నిప్పులు చెరిగారు. కేవలం రెండున్నర ఎకరాలున్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఏకంగా రూ.3వేల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని అప్పట్లో తెహల్కా పత్రిక బయటపెడితే.. చంద్రబాబు ఆ పత్రిక పెద్దల కాళ్లు పట్టుకుని తన వివరణ వేయించుకున్నారని చెప్పారు. తాను చేస్తున్న న్యాయ పోరాటాన్ని జగన్ తో ముడిపెట్టడం కరెక్టు కాదని ఏబీకే పేర్కొన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →