బాబుకు జగన్ షేక్‌హ్యాండ్ ఇచ్చారా? లేదా?
ఒకరేమో రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. మరొకరేమో రాష్ట్రానికి ప్రతిపక్ష నేత. వీళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం.. ఎత్తులకు పై ఎత్తులువేసుకుంటూ ఉంటారు. అసెంబ్లీలో అయితే చెప్పనవసరం లేదు. ఉప్పు…నిప్పులాగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిలు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఇచ్చిన ఎట్ హోం కార్యక్రమంలో కలిశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇదే కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయనతో కాసేపు ముచ్చటించిన జగన్, ఏసీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్తోనూ అసెంబ్లీ విషయాలు చర్చించారు. అయితే అక్కడే ఉన్న ఏపీ సీఎం బాబును జగన్ షేక్ హ్యాండ్ ఇచ్చారా? లేదా? అన్నది పెద్ద చర్చకు దారి తీసింది.
ప్రజల్లోనే కాదు.. పత్రికల్లోనూ వాడీవేడీగా చర్చ నడుస్తోంది. చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న కొన్ని పత్రికలు మాత్రం చంద్రబాబును జగన్ కలవలేదని, అభివాదం మాత్రమే చేసి వెళ్లిపోయారని రాసుకుంటే.. జగన్‌కు అనుకూలంగా ఉన్న కొన్ని పత్రికలు ఇవి పచ్చమీడియాకు కనిపించడం లేదా అంటూ కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు. అందులో చంద్రబాబు, జగన్ ఇద్దరూ షేక్‌హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉన్నారు. అయితే గతంలో అసెంబ్లీలో చంద్రబాబు జగన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వబోగా జగన్ అభివాదం మాత్రమే చేశారు. ఏది ఏమైనా ఇప్పటికైనా ఇద్దరూ షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.