Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Did MS Dhoni really ‘fix’ Manchester Test, as alleged by Sunil Dev?

By   /  February 8, 2016  /  Comments Off on Did MS Dhoni really ‘fix’ Manchester Test, as alleged by Sunil Dev?

    Print       Email

ms dhoni2

థోనీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు..?

InCorpTaxAct
Suvidha

 

మ్యాచ్ ఫిక్సింగ్.. ఈ పదం వినడం క్రికెట్ అభిమానులు అందరికి కామన్ అయిపోయింది. గతంలో చాలాసార్లు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు టీమిండియాను చుట్టుముట్టాయి. మళ్ళీ ఈ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సారి భారత బ్యాటింగ్ దిగ్గజం.. వన్డే రథసారధి మహేంద్ర సింగ్ థోనీపై ఈ ఆరోపణలు రావడం సంచలనం కలిగిస్తున్నాయి. 2014లో మాంచెస్టర్ వేదికగా ఇండియా-ఇంగ్లడ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ ఫిక్స్ అయిందని.. అప్పటి టీమిండియా మేనేజర్ సునీల్ దేవ్ సంచలన ఆరోపణలు చేశారు.

హిందీ న్యూస్ పేపర్ సన్‌ స్టార్‌ చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌లో సునీల్‌ ఈ ఆరోపణలు చేసి అడ్డంగా బుక్కయిపోయారు. భారత్ ఇన్నింగ్స్‌ తేడాతో చిత్తుగా ఓడిపోయిన ఆ మ్యాచ్‌లో ధోనీ పాత్రపై సందేహాలు వ్యక్తం చేశారు సునీల్ దేవ్. అప్పుడు భారత టెస్టు జట్టుకు ధోనీ కెప్టెన్‌గా ఉన్నారు. వర్షం కారణంగా పిచ్‌ పరిస్థితి దృష్ట్యా.. మొదటగా బౌలింగ్‌ చేయాలని టీమ్‌ సభ్యుల మీటింగ్ లో నిర్ణయించాం. కానీ, ధోనీ బ్యాటింగ్‌ ఎంచుకోవడంతో ఆశ్చర్యానికి లోనయ్యానని స్టింగ్‌ ఆపరేషన్‌లో భాగంగా షూట్ చేసిన వీడియోలో సునీల్ దేవ్‌ పేర్కొన్నారు. ఈ వీడియోను ఆదివారం భారత ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ధోనీ నిర్ణయాన్ని చూసి ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జెఫ్రీ బాయ్‌కాట్‌ కూడా షాక్ అయ్యారని వీడియోలో ఆయన అన్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. అప్పటి బోర్డు అధ్యక్షుడు ఎన్‌ శ్రీనివాసన్‌కు లేఖ కూడా రాశానన్నారు. అయితే ఈ విషయంపై బీసీసీఐ స్పందించలేదని ఆయన సమాధానమిచ్చారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →