Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Differences between Babu and Ganta!

By   /  April 11, 2016  /  Comments Off on Differences between Babu and Ganta!

    Print       Email

ganta babuబాబు వ‌ర్సెస్ గంటా

 

InCorpTaxAct
Suvidha

 

ఇద్ద‌రి మ‌ధ్య‌న పెరుగుతున్న అంత‌రం

వీసీల ఎంపిక‌లో బేధాభిప్రాయాలు

పంతం నెగ్గించు కోవాల‌ని చూసిన గంటా

స‌సేమిరా అన్న బాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుల మ‌ధ్య బేధాభిప్రాయాలు వ‌చ్చిన‌ట్లు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌ల ఎడ‌మొహం పెడ‌మొహంగా ఉంటున్నారు. త‌న నిర్ణ‌యాన్ని కాదంటున్న ముఖ్య‌మంత్రిపై గంటా గ‌రం గరం అవుతున్నాడు. ఇంత‌కీ వీరిద్ద‌రి మ‌ధ్య ఎందుకు దూరం పెరుగుతుందో తెలుసుకోవాలంటే వివ‌రాల్లోకి వెళ్లాలి. ఆంధ్రాయూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఎంపిక ప్రక్రి యలో మంత్రి గంటా శ్రీనివాసరావు సిఫారసులకు సీఎం చంద్ర బాబు ససేమిరా అంటున్నారు. వీసీగా నారాయణను నియమిం చాలని మంత్రి గంటా పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో ఏ విశ్వవి ద్యాలయం వీసీ నియామకాంలోనూ తాను సూచించినవారికి అవకాశం ఇవ్వలేదన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే వర్సిటీ విషయంలోనైనా తన సిఫారుసును ఆమోదించాలని కోరారు. అయితే గంటా ఎంతగా మొరపెట్టుకున్నా నారాయణకు వీసీగా అవకాశం ఇచ్చేం దుకు చంద్రబాబు సమ్మతించలేదు.

వీలైనంతవరకు ఇతర విశ్వవిద్యాలయాలకు చెందిన వారికే వీసీగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన సొంత జిల్లా చిత్తూరుకు చెందిన ఓ ప్రొఫెసర్‌పై చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఏయూకు చెందిన వారినే నియమించాలని భావిస్తే రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణ్ణకుమారి, రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావుల పేర్లను పరిగణనలోకి తీసుకుంటారు. రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు ఇటీవల వివాదాస్పదుడు కావడంతో కృష్ణకుమారివైపు కాస్త మొగ్గు కనిపిస్తోంది. ఏది ఏమైనా వీసీ నియామకంలో మంత్రి గంటా మాట మాత్రం చెల్లుబాటుకావడం లేదని స్పష్టమవుతోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →