మహానాడులో విభేదాలు భగ్గుమంటాయా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి మహానాడు కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి తిరుపతికి మార్చారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు వేడుకలను తిరపతిలో నిర్వహించాలని నిన్న జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడుకు ఒక కొత్త చిక్కు వచ్చి పడింది. తెలంగాణలో ఎమ్మెల్యేలు అందరూ టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో అక్కడ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు మహానాడుకు వస్తారో? రారో? అన్న అనుమానంతో మహానాడును హైదరాబాద్ నుంచి తిరుపతికి మార్చిన చంద్రబాబు ఇప్పుడు అక్కడ కూడా బాబు తలనొప్పులు తప్పవనే వాదనలువినిపిస్తున్నాయి. తెలుగు తమ్ముళ్లలో కొంతమంది ముబావంగా ఉన్నారు. ఇటీవల వైసీపీ నుంచి పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆ యా ప్రాంతాల టీడీపీ నాయకులకు ఈ చేరికలు రుచించడం లేదు. ఎన్నికల్లో విజయం సాధించకపోయినా పార్టీ అధికారంలో ఉందనే ధీమాతో నాయకులు నెట్టుకొస్తున్నారు. అయితే ప్రత్యర్థి నేత సొంత గూటిలోకి చేరిపోవడంతో స్థానికంగా సదరు నాయకుడు రెండో స్థానానికి చేరిపోతాడు.
ఇన్నాళ్లు స్థానికంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుని, ఇప్పుడు అదే జనంలో కలిసిమెలిసి తిరగడం మింగుడుపడడం పడడం లేదు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే చేరికల కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు హాజరుకాలేదు. అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి చేరికపై కరణం బలరాం అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో వైసీపీ నుంచి వచ్చిన భూమా నాగిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్ర పాణి మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండు రోజులుగా ఇద్దరినీ శాంతింపచేసేందుకు టీడీపీ మంత్రులు ప్రయత్నిస్తున్నారు. వీరందరూ అన్ని మరిచిపోయి తిరుపతిలో జరిగే మహానాడుకు వస్తారా..? దూరంగా ఉంటారా..? అన్న సందేహం కలుగుతుంది. అంతేకాదు ఒకవేళ ఎవరైనా మహానాడు వేదికగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటే మాత్రం టీడీపీ పరువు గంగలో కలుస్తుందని బాబు భావిస్తున్నారు. అందుకే బాబు ఇప్పటి నుంచే అందరినీ శాంతిపచేస్తున్నారని సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.