Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Different dissuctions on Jagan Words..

By   /  March 25, 2016  /  Comments Off on Different dissuctions on Jagan Words..

    Print       Email

YS JAGANజగన్ మాటలపై రాజకీయ వర్గాల్లో చర్చలు..

 

InCorpTaxAct
Suvidha

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ ఏం మాట్లాడిన వివాదాస్పదంగా తయారవుతోంది. అంతేకాదు ఆయన మాటలపై రాజకీయ వర్గాల్లో చర్చలు కూడా జరుగుతున్నాయని సమాచారం.కొన్ని రోజుల కిందట రాజ్‌భవనలో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి వచ్చారు జగన్. ఆయన బయటకు వచ్చాక.. 21 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని బాంబు పేల్చారు. అంతేకాదు టీడీపీ ప్రభుత్వాన్ని ఓ గంటలో పడగొడతామన్నారు. ఆయన మాటల తర్వాత ఏపీలో పరిణామాలు ఎంత సంచలనంగా మారాయో అందరికి తెలిసిందే.

మళ్ళీ జగన్ అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈసారి నెల్లూరులో ఆనం విజయకుమార్‌రెడ్డి వైసీపీలో చేరిన సందర్భంగా జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్డాల్లో కూడా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ‘ఆ రోజున నేను, అమ్మే ఉన్నాం. నాయకులెవరూ లేరు.తమను జనమే ఆదరించారు. సోనియా, చంద్రబాబు కుమ్మక్కై కేసులు పెట్టినా నేను భయపడలేదు. దేవుడిని, ప్రజలను నమ్ముకున్నా’ అని అన్నారు. ఇటీవల పార్టీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు జంప్ కొట్టారు. వారి బాటలోనే మరికొందరు వెళతారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో జగన చేసిన పై వ్యాఖ్యలను వైసీపీ నేతలు, రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు. పార్టీ నుంచి ఎవరు బయటకు పోయినా ఫర్వాలేదన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారా అనే సందేహాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా.. ప్రజలు తనతోనే ఉన్నారని జగన్ భావిస్తున్నారని మరికొందరు చెప్పుకుంటున్నారు. ఇక.. పార్టీలో ఉన్నవారే నావాళ్లు.. బయటకు పోయినవారు పరాయివాళ్లేనని జగన్ భావిస్తున్నారని ఇంకొందరు అనుకుంటున్నారు. ఇలా నెల్లూరు జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చలకు అవకాశం ఇచ్చింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →