Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

ప‌చ్చ‌ని తెలంగాణ కోసం పాలమూరు జిల్ల డిండి చింతపల్లి గ్రామంలో కార్యకర్తల పరవల్లు

By   /  July 13, 2016  /  No Comments

    Print       Email

IMG_9841

maxresdefaultతెలంగాణ రాష్ట్రాన్ని ఆకుప‌చ్చ‌గా మార్చుకుందాం.. ఇది అంద‌రి బాధ్య‌త అని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు ఇచ్చిన పిలుపున‌కు భారీ స్పంద‌న వ‌చ్చింది. `హ‌రిత హారం` పేరుతో తెలంగాణ స‌ర్కార్ చేప‌ట్టిన కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌జ‌లు.. అధికారులు… సినీ స్టార్స్ ఇలా అంద‌రూ ఏక‌మై మొక్క‌లు నాటారు.

InCorpTaxAct
Suvidha

గ‌తంలో ఎప్పుడూ జ‌ర‌గ‌ని విధంగా.. ఎవ‌రూ చేయ‌ని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు 29 ల‌క్ష‌ల మొక్క‌లు నాటారు. అనుకున్న ల‌క్ష్యంకంటే 4 ల‌క్ష‌ల మొక్క‌లు అధికంగా నాటారు. అధికారులతోపాటు సామాన్య ప్రజానీకం, విద్యార్థులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, కాలనీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఐటీ ఉద్యోగులు, సామాన్య పౌరులు. మెగాస్టార్ చిరంజీవి.. కింగ్ నాగార్జున.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. దగ్గుబాటి రానా.. ఇలా చాలామంది తమ వ్యక్తిగతంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి ‘హరితహారం’లో పాల్గొన్నారు. ఇలా అన్ని వర్గాలు బృహత కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అయితే ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ భావితరాలకు పచ్చని తెలంగాణను మనం బహుమతిగా ఇవ్వా ల్సి వుంటుందని, అందుకే తాను ఇంతగా తాపత్రయపడుతున్నానని సీఎం కేసీ ఆర్ చెప్పారు. వానలతో ప్రస్తుతం కాలం కూడా కనికరిస్తున్నదని అన్నారు. ఇది మొక్కల పెంపకానికి అనువైన అవకాశమన్నారు. నిర్లక్ష్యంతో చక్కటి అవకాశాన్ని జారవిడుచుకోవద్ద ని తెలిపారు. అటువంటి అలసత్వాన్ని ప్రభుత్వం ఏ మాత్రం సహించదని హెచ్చరించారు.

అచ్ఛంపేట TRS ఎమ్మెల్యే శ్రీ గువ్వల బాలరాజు గారు మరియు డిండి చింతపల్లి గ్రామానికి చెందిన శ్రీ ఇందుర్తి గణపతి రెడ్డితో (EnC R&B,  NH)  పాటు ఎంతో మంది TRS కార్యకర్తలు ఈ కార్యక్రమములొ పాల్గొని కొండరెడ్డి పల్లి మొదలుకొని, పోల్కం పల్లి, డిండి చింతపల్లి గ్రామాలలో వేలకొద్ది మొక్కలు నాటడం ఈ గ్రామాలలొ ఉన్న ప్రజలను బాగా ఆకర్శించింది. దాదాపుగ వేయి మంది ప్రజలు సమావేషమై డిండి చింతపల్లిలో గణపతి రెడ్డి గారికి మరియు MLA బాలరాజు గారికి ఘణంగా సన్మానం చెసి వారి సంతోశాన్ని ఈ సన్మాన కార్యక్రమములొ పంచుకున్నారు. ఈ సంధర్భముగ మాటాడుతు నాటిన మొక్కలను చక్కగా చూసుకునే బాద్యత గ్రామప్రజలదే అని వీరు కార్యకర్తలకు పిలుపు నిచ్హారు.

MPP విజయలక్ష్మి  శ్రీనివస్ మలిపెద్ది, సర్పంచ్ మామిడాల కరునణాకర్ రెడ్డి, వ్యాపారవేత్త రజేందర్ రెడ్డి, ఎనుముల రాజశేఖర్ రెడ్డి, పల్ల కిష్టా రెడ్డి, Single Window Chairman మామిడాల శేఖర్ రెడ్డి, గ్రామ పెద్ద ఇందుర్తి శేఖర్ రెడ్డి, మరియు గ్రామానికి చెందిన NRI  ఇందుర్తి రవిందర్ రెడ్డి ఈ కార్యక్రమములొ పాల్గొన్నారు. అమెరికాలో ఉండి ఈ కార్యాక్రామనికి హాజరు కాలేకపోయినప్పటికి కార్యకర్తలతో మాట్లాడుతు ఈ కార్యక్రమము జయప్రదం అవ్వడానికి ఇందుర్తి హన్మంతు రెడ్డి తనవంతు సహాయాన్ని అందించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →