చిరుకు అది సూచనా.. హెచ్చరికా?
మెగాస్టార్ చిరంజీవికి ఎవరైనా సూచన చేయాలనా.. సలహాలు చెప్పాలన్నా ఆ స్థాయి వ్యక్తి అవసరం. ఎందుకంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని మెగాస్టార్‌గా నిలిచిన వ్యక్తి చిరు. అయితే ఇటీవల ఓ దర్శకుడు చిరంజీవిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చిరు అభిమానులకు కోపం తెప్పిస్తున్నా.. అదే వాస్తవమని మరికొందరు అంటున్నారు. వివరాల్లోకి వెళ్లితే… చిరంజీవికి మెగాస్టార్ ఇమేజ్ రావడానికి పునాదులు వేసిన వారిలో ప్రముఖ దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి (ఏకోరెడ్డి) ఒకరు. అందుకే చిరు కెరీర్ కు సంబంధించి సలహాలు, సూచనలు చేసే అర్హత ఆయనకు ఉంది. తాజాగా “వినోదాత్మక చిత్రంలో చిరంజీవి నటిస్తే బావుంటుంది“ అని సలహా ఇచ్చారు. అయితే దీనిపై చిరంజీవి అభిమానులు సీరియస్ అవుతున్నారు. తమ హీరోను కమెడియన్‌ను చేస్తారా అంటూ మండిపడుతున్నారు. ఈ విషయంపై రోజుకో రచ్చ చేస్తున్నారు. అయితే దీనిపై సినీవిశ్లేషకులు స్పందిస్తూ కొన్ని ఉదాహరణలు చెప్పారు. రజనీకాంత్, చిరంజీవి వీరంతా అమితాబ్ బచ్చన్ ని గౌరవిస్తారని, ఆయన తన స్టార్ డమ్ ను నిలబెట్టుకునే ప్రయత్నంలొ మాస్ సినిమాలు చేశాక, మళ్ళీ ఆ స్థాయి కథలు దొరకడం కష్టమైన నేపథ్యంలో వినోదాన్ని నమ్ముకున్నారని, సత్తేప సత్తా, నమక్ హలాల్ వంటి వినోదాత్మక కథా చిత్రాల్లో నటించి సక్సెస్ అయ్యారు వారు గుర్తు చేస్తున్నారు.
రజనీకాంత్ చిత్రాల్లో సైతం ప్రథమార్ధం వినోదంగా, ద్వితీయార్థం సీరియస్ గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందేనంటున్నారు. ఇవన్నీ పరిశీలించాక కోదండరామిరెడ్డి చిరంజీవికి సూచన చేసి ఉంటారని వారు అభిప్రాయపడుతున్నారు. మహానటులు ఎన్టీఆర్ యమగోల, అక్కినేని శ్రీరంగనీతులు వంటి హాస్యప్రధానమైన సినిమాల్లో నటించి సక్సెస్ సాధించారని, నటుడు అనేవాడు అన్ని రకాల పాత్రలను చేయాలంటున్నారు. ఏదేమైనా ఓ మెగాస్టర్‌ను చేసిన దర్శకుడిగా కోదండరామిరెడ్డి చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.