దేవుడి సాక్షిగా చెబుతున్నా…
“ఆరోజు అలా మాట్లాడానన్న విషయం సోషల్ మీడియాలో, పలు ఛానెళ్లల్లో చూసేవరకు నాకు తెలీదు. అవన్నీ చూశాక నేనిలా మాట్లాడానా అని చాలా బాధపడ్డాను. దేవుడి సాక్షిగా చెబుతున్నా. నాకు తెలియకుండానే ఆ రెండు మాటలు అన్నాను. ఏదో ఫ్లోలో (యథాలాపంగా) అలా మాట్లాడేశాను“ అని ప్రముఖ దర్శకుడు ఎ.కోదండ రామిరెడ్డి మెగాస్టార్ చిరంజీవిపై చేసిన కామెంట్స్‌పై వివరణ ఇచ్చారు. ఇటీవల విజయవాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ దర్శకుడు ఎ.కోదండ రామిరెడ్డి చిరంజీవి 150వ చిత్రంపై పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే దానిపై కోదండరామిరెడ్డి వివరణ ఇస్తూ చిరంజీవితో సినిమా చెయ్యాల్సి వస్తే పూర్తిస్థాయి కామెడీ, లవ్, యాక్షన్, డాన్సకి స్కోపున్న కథని ఎంచుకుంటాననీ, ఆయన బాడీ అంతా కామెడీతో నిండి ఉంటుందనీ, రైతులకు అండగా ఉంటాను అంటూ ఈ రోజుల్లో సందేశాత్మక చిత్రాలు చేస్తే ప్రజలు చూడరని వ్యాఖ్యానించిన మాట నిజమేనని అయితే ఆ మాటలు కావాలని అన్న మాటలుకావన్నారు. చిరంజీవితో తాను చాలా సినిమాలు చేశానని, తమ ఇద్దరి మధ్య నేటికీ మంచి సాన్నిహిత్యం ఉందని పేర్కొన్నారు. తానూ ఫ్లాప్ సినిమాలు తీశానని, ఫలాన బ్యానర్లో సినిమాలు తీస్తే ఆడతాయి అని చెప్పడానికి తానేమీ దేవుణ్ణి కాదన్నారు. పొరపాటుగా మాట్లాడాను కాబట్టి చిరంజీవికి, చిత్ర నిర్మాత చరణ్‌కి, వి.వి.వివినాయక్కి, మెగా అభిమానులకు సారీ చెబుతున్నాను పేర్కొన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.