Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Director Maruthi Satires on Sukumar ..!

By   /  August 15, 2016  /  Comments Off on Director Maruthi Satires on Sukumar ..!

    Print       Email

Sukumar 1సుకుమార్ పై మారుతి సెటైర్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

దర్శకుడు సుకుమార్ చాలా తెలివైనవాడు. ఈ విషయాన్ని ఆయన తీసే సినిమాలను బట్టి ఇట్టే చెప్పొచ్చు. ముఖ్యంగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. మహేశ్ బాబుతో తీసిన ‘1 నేనొక్కడితే’.. ఎన్టీఆర్ తో తీసిన ‘నాన్నకు ప్రేమతో..’ ఆయన టాలెంట్ కి నిదర్శనాలు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా సత్తా చాటలేకపోయాయి. ఈ రెండు సినిమాల కథ చాలా బాగున్నా.. కథనం మాత్రం సామాన్య ప్రేక్షకులకు పెద్దగా అర్ధం కాలేదు. అందుకే ఈ సినిమాలు సక్సెస్ సాధించలేకపోయాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాని బహిరంగంగా ఎవరూ ఆయన సినిమాల గురించి విమర్శించింది లేదు.

కాని వెంకీతో ‘బాబు బంగారం’ సినిమా తీసిన దర్శకుడు మారుతి మాత్రం సుకుమార్ పై సెటైర్లు వేశాడు. సామాన్య జనానికి అర్ధం కాకుండా సినిమాలు తీయడం వల్లే సుకుమార్ సినిమాలు ఫెయిల్ అవుతున్నాయని సెటైర్లు విసిరాడు.’బాబు బంగారం’ సినిమాలో ప్రముఖ కమెడియన్ పృథ్వీ ‘నాన్నకు ప్రేమతో..’సినిమాలోని ఎన్టీఆర్ లా డ్రెస్ వేసుకొని అర్ధరాత్రి హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘నాన్నకు ప్రేమతో..’ థీమ్ మ్యూజిక్ వస్తూంటుంది. అప్పుడు.. హీరోయిన్‌తో పృథ్వీ ‘నీకు నాన్నకు ప్రేమతో కాన్సెప్ట్’ అర్థం కాలేదా? అని అడుగుతాడు. దానికి ఆమె ‘లేదు’ అంటుంది. అప్పుడు పృథ్వీ ‘అర్థం కాలేదా.. అయితే సూపర్ హిట్టే’ అంటాడు.

‘జనాలకు అర్థం కాలేదు కాబట్టే ‘నాన్నకు ప్రేమతో..’ హిట్ అయిందని సుకుమార్‌పై సెటైర్ విసరడానికే.. మారుతి.. పృథ్వీతో డైలాగ్ చెప్పించాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఆశక్తికర చర్చ నడుస్తోంది. మరి నిజంగానే మారుతి సెటైర్ వేయించాడా.. లేక సరదాగా చెప్పించాడా..? ఈ విషయం ఆయనే చెప్పాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →