అంపశయ్య మూవీ విశేషాలు చెప్పిన డైరెక్టర్ ప్రభాకర్ జైని..
‘అమ్మా నీకు వందనం’ మూవీ ద్వారా సరోగేట్ మదర్స్ హృదయవేదనను తెరకెక్కించిన దర్శకుడు ప్రభాకర్ జైని. ప్రస్తుతం ఆయన డైరెక్షన్ లో విజయలక్ష్మి జైని నిర్మాతగా రూపొందుతోన్న సినిమా `అంపశయ్య`. నవల పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న సుప్రసిద్ధ రచయిత అంపశయ్య నవీన్ తీర్చిదిద్దిన ఏళ్ళనాటి కథను సినిమా రూపంలో తెరకెక్కించడం నిజంగానే ఓ సాహసం. కొన్ని దశాబ్దాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటిలో అంపశయ్య చిత్రం షూటింగ్ జరిగింది. జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్యామ్ కుమార్, పావని హీరో హీరోయిన్స్ గా నటించారు. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఈ చిత్ర విశేషాల గురించి చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైని మాట్లాడారు. ‘ 1960 – 70 ప్రాంతంలో తెలంగాణ లోని ఒక గ్రామం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ కి వచ్చి రవి అనే యువకుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ చదువుతుంటాడు . అతనికి పరీక్షలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలోలో.. ఒక రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కలిగిన అనుభవాలు అతనికి ఎలా కర్తవ్య బోధన చేశాయి..? అతనిలోని భయాలు, ఆందోళనలను రూపు మాపి జీవితం అనే యుద్ధ రంగంలోకి ప్రవేశించే ధైర్యాన్ని ఎలా ఇచ్చాయి.. ? ఆ సందర్భంగా రవికి గుర్తొచ్చిన అనేక సంఘటనలు ఏంటి.. ? అనేది కథాంశం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ నవీన్ రచించిన మొదటి నవల ‘అంపశయ్య’. ఈ నవలను సినిమాగా తీయాలనే లక్ష్యం తో చాలా కృషి చేశాం. ఇందులో నటించిన వారందరూ కొత్త నటులే. ఒక గొప్ప నవలను సినిమాగా తీశామని చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.