Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Director Srinu Vaitla ropes actor Ram for ‘Ready’ sequel

By   /  August 20, 2016  /  Comments Off on Director Srinu Vaitla ropes actor Ram for ‘Ready’ sequel

    Print       Email

Srinu Vaitla 2శ్రీనువైట్లకు కండీషన్ పెట్టిన హీరో రామ్..?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఎనర్జిటిక్ హీరో రామ్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘రెడీ’ సినిమా బంపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోందని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ సీక్వెల్ తీయాలంటే ఖచ్చితంగా వరుణ్ తేజ్ తో శ్రీను వైట్ల తీస్తున్న సినిమా హిట్ అయి తీరాలని రామ్ కండీషన్ పెట్టాడట. ఇంతకీ ఈ కండీషన్ ఎందుకు పెట్టినట్లు..? దానివెనుకున్న పరమార్ధం ఏమిటి..? తెలియాలంటే చదవండి..

హీరో రామ్ కెరీర్ లో భారీ హిట్ కొట్టిన చిత్రాల్లో ‘రెడీ’ సినిమా కూడా ఉంది. ఈ మూవీతో దర్శకుడు ‘శ్రీనువైట్ల’ మంచి సక్సెస్ అందుకున్నాడు. అప్పట్లో ఈ సినిమా భారీ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని రామ్-శ్రీనువైట్ల కొద్దికాలంగా చర్చలు జరుపుతున్నారు. అయితే ఇటీవల ఈ దర్శకుడు పెద్దగా ఫామ్ లో లేడు. ‘దూకుడు’ సినిమా తర్వాత ఆయన తీసిన ‘బాద్ షా’ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. తర్వాత ‘బ్రూస్ లీ’, ‘ఆగడు’ చిత్రాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఈ దర్శకుడితో సినిమా అంటే పెద్ద హీరోలు భయపడుతున్నారట. దీన్ని గమనించిన రామ్.. వరుణ్ తేజ్ తో తీస్తున్న ‘మిస్టర్’ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలని కండీషన్ పెట్టాడట. దీంతో ఆ సినిమా హిట్ కొట్టడం ఈ డైరెక్టర్ కి కంపల్సరీ అయింది. అంతేకాదు.. ‘మిస్టర్’ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ట్రాక్ లోకి వచ్చి ‘రెడీ’ సినిమా సీక్వెల్ ని సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని కసిగా ఉన్నారట శ్రీనువైట్ల.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →