Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Disco Raja Movie Review : 2.5/5

By   /  January 24, 2020  /  No Comments

    Print       Email

డిస్కోరాజా రివ్యూ


చాలా రోజుల గ్యాప్ తీసుకుని డిస్కో రాజా అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. ‘రాజా ది గ్రేట్’ తరువాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ర‌వితేజ “డిస్కోరాజా“ చిత్రంతో హిట్ అందుకున్నాడా? ప‌్రేక్ష‌కుల‌ను మెప్పించాడా? అన్న‌ది రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం. 

InCorpTaxAct
Suvidha

మూవీ రివ్యూ: డిస్కో రాజా
నటీనటులు: రవితేజ, నభ నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్య హోప్, బాబీ సింహా, సునీల్, సత్య తదితరులు
దర్శకత్వం: విఐ ఆనంద్
నిర్మాత: రజినీ తాళ్లూరి
సంగీతం: ఎస్ ఎస్ థమన్
విడుదల తేదీ: జనవరి 24, 2020

కథ :
అనాథ‌గా పెరిగిన డిస్కో రాజా (రవితేజ) కసితో మద్రాస్ లో పెద్ద గ్యాంగ్ స్టర్ గా మారతాడు. డిస్కో రాజా లైఫ్ లోకి హెలెన్ (పాయల్ రాజ్ పుత్) వస్తోంది. డిస్కో రాజా ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం డిస్కో రాజా అన్ని వదిలేసి హెలెన్ తో లడఖ్ ప్రాంతానికి వచ్చేస్తాడు. ఈ మధ్యలో తనకు అడ్డు వచ్చిన బర్మా సేతు (బాబీ సింగ్)ను జైలుకి పంపి అడ్డు తొలిగిస్తాడు. కానీ ఆ తరువాత తన పై జరిగిన అటాక్ లో డిస్కో రాజా చనిపోయి.. మళ్ళీ ముప్పై సంవత్సరాల తరువాత డెడ్ బాడీగా రీసెర్చ్ టీంకి దొరుకుతాడు. చనిపోయిన మనుషుల్లో మళ్ళీ జీవం పోసి బతికించడానికి ఎప్పటినుంచో రీసెర్చ్ చేస్తోన్న టీమ్ (తాన్యా హోప్ బ్యాచ్) కారణంగా డిస్కో రాజా మళ్ళీ బతుకుతాడు. మరోపక్క వాసు (రవితేజ) కోసం కొంతమంది వెతుకుతూ ఉంటారు. ఇంతకీ వాసుకి డిస్కో రాజాకి ఉన్న సంబంధం ఏమిటి ? వాళ్లిద్దరూ ఎందుకు ఒకేలా వున్నారు ? అసలు ‘డిస్కో రాజా’ను చంపింది ఎవరు ? వారి పై డిస్కో రాజా ఎలా పగ తీర్చుకున్నాడు ?
అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెర పై చూడాల్సిందే.

సాంకేతిక విభాగం :
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసిన దర్శకుడు వీఐ ఆనంద్. మంచి పాయింట్  తీసుకుని డిస్కో రాజా తీసిన‌ప్ప‌టికీ, ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లే రాసుకోలేక‌పోయార‌నిపిస్తోంది. అయితే దర్శకుడిగా ఆనంద్ పనితనం మాత్రం బాగుంది. ఇక సినిమాలో కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. ఇక సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు కూడా బాగున్నాయి. మెయిన్ గా డిస్కో రాజా సాంగ్ సినిమాకే స్పెషల్ గా నిలుస్తోంది. అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఎడిటర్ ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేయాల్సింది. నిర్మాత రామ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు అద్భుతంగా ఉన్నాయి.

నటీనటులు :
మాస్ మహారాజ రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో ఈ సినిమాకు ఒక సరికొత్త ఎనర్జీ ఇచ్చాడు. ఇక సినిమాలోని ఇద్దరు హీరోయిన్స్‌ పాయల్ రాజ్ పుత్ మరియు నభా నటేష్ లు తమ పాత్రలకు తగ్గట్టుగా మంచి నటన కనబర్చారు. అలాగే ఇతర పాత్రల్లో నటించిన నటినటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా విలన్ రోల్ లో కనిపించిన బాబీ సింహా తనలోని విలన్ యాంగిల్ ను అద్భుతంగా చూపించారు. అలాగే కామిక్ పాత్రల్లో కనిపించిన కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్ తమ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్నిచోట్ల బాగా నవ్వించారు.

ప్లస్ పాయింట్స్ :
రవితేజ నటన
మెడికిల్ కి సంబంధించిన గుడ్ థీమ్
కామెడీ ఎలిమెంట్స్
మనసుకు హత్తుకునే విజువల్స్
థమన్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :
స్క్రిప్ట్
ఓవర్ సినిమాటిక్
సెకెండ్ హాఫ్ వచ్చే ఊహాజనితమైన సీన్స్
 స్క్రీన్ ప్లే

తీర్పు :
ఓవరాల్ గా రవితేజ – వి.ఐ ఆనంద్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ స్కైఫై థ్రిల్లర్ జస్ట్ ఒకే అనిపిస్తోంది. హీరో అండ్ విలన్ల మధ్యన వచ్చే మెయిన్ సన్నివేశాలు అలాగే సినిమాలోని మెయిన్ ఎమోషన్ కూడా బాగా సినిమాటిక్ గా అనిపిస్తాయి. అయితే రవితేజమాత్రం రెండు క్యారెక్టర్స్ లో రెండు షేడ్స్ లో ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఈ సినిమా పర్లేదు అనిపిస్తుంది.

రేటింగ్: 2.5/5

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →