Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Divya Dutta is set to become a writer

By   /  February 1, 2016  /  Comments Off on Divya Dutta is set to become a writer

    Print       Email

divya-dutta-with-mother1రచయితగా మారనున్న నటీమణి..!
బాలీవుడ్ నటీమణి దివ్యా దత్తా రచయిత్రిగా మారనున్నారు.త్వరలోనే ఓ పుస్తకాన్ని రాయాలనుకుంటున్నట్లు తెలిపారు.ఇంతకీ ఆ పుస్తకం ఏంటి..? అనేగా మీ డౌట్.. దాని మీద ఆమె క్లారిటీ ఇచ్చారు.తన తల్లి గురించి పుస్తకంలో రాయాలనుకుంటున్నట్లు వెల్లడించారు.

గత జనవరి 10న దివ్యాదత్తా తల్లి డాక్టర్ నళిని మృతి చెందారు.ఆమెతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని అందరితో పంచుకోవాలనుకుంటున్నానని దివ్య అంటున్నారు.తన చిన్నతనంలోనే తండ్రి మరణించారని తెలిపారు. అయితే తన తల్లి ఒంటరిగానే ఎంతో ధైర్యంతో తమని పెంచిందని చెప్పారు. తనతో పంచుకున్న ప్రతిక్షణం ఎంతో విలువైనదని దివ్యా అన్నారు. ఆ క్షణాలకు అక్షర రూపం ఇవ్వాలని భావిస్తున్నానని చెప్పారు. అయితే పుస్తకానికి ఇంకా పేరు పెట్టలేదన్నారు. ఈ ఏడాది పుస్తకాన్ని రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. తాను తల్లిని కోల్పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నానని తెలిపారు. బాధ నుంచి బయటపడేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు దివ్యా దత్త.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →