Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

DJ movie unit faces problem in Karnataka..?

By   /  February 19, 2017  /  Comments Off on DJ movie unit faces problem in Karnataka..?

    Print       Email

dj-allu-arjunవివాదంలో ఇరుక్కున్న అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథమ్’ మూవీ..?

 

InCorpTaxAct
Suvidha

 

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మూవీ ‘డీజే – దువ్వాడ జగన్నాథమ్’. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ బ్రాహ్మణుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ోసం కర్నాటకలోని హాసన జిల్లా బేలూరు చెన్న కేశవ స్వామి ఆలయంలో సెట్లు వేశారు. అక్కడ శివాలయం, శివలింగం భారీ సెట్లు వేశారు. ప్రస్తుతం ఇవే వివాదానికి కారణం అయ్యాయి. చెన్న కేశవ వైష్ణవ ఆలయంలో శైవచారానికి సంబంధించిన సెట్లను ఎలా వేస్తారంటూ స్థానికులు అడ్డం తిరిగారు. అలాగే చారిత్రక ఆలయంలో షూటింగ్ ఎలా చేస్తారని చిత్ర యూనిట్ పనులను అడ్డుకున్నారు.

తాము ఇక్కడ షూటింగ్ కోసం దేవాదాయ శాఖ నుంచి పర్మీషన్ తెచ్చుకున్నామని మూవీ యూనిట్ వారికి తెలిపింది. చిత్రీకరణ సందర్భంగా లక్షన్నర చెల్లించామని కూడా వివరించింది. కాని స్థానికులు వినిపించుకోవడం లేదు. షూటింగ్ పేరుతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారని వారంటున్నారు. ఇక ఆలయ పూజారులు స్వామి వారికి పూజలు చేయడానికి కూడా షూటింగ్ తో ఇబ్బందిగా ఉందని వాదించారట. దీంతో మూవీ యూనిట్ కాసేపు షూటింగ్ ను నిలిపివేసినట్లుగా సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →