Loading...
You are here:  Home  >  Business News  >  Current Article

Do not trust what KCR’s words says Uttam Kumar Reddy

By   /  August 18, 2016  /  Comments Off on Do not trust what KCR’s words says Uttam Kumar Reddy

    Print       Email

uttamkumareddyకేసీఆర్ మాట‌లు అబ‌ద్దాలు: ఉత్త‌మ్‌

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు చెప్పేమాట‌లు అన్నీ అబ‌ద్దాలేనంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. తెలంగాణ‌ను స‌స్య‌శ్యామ‌లం చేస్తామ‌ని, కోటి ఎక‌రాల‌కు నీరంద‌స్తామ‌ని చెప్పే మాట‌లు కూడా అబ‌ద్దాలే అంటున్నారు. ఇటీవ‌ల అసెంబ్లీలో ఇరిగేష‌న్‌పై కేసీఆర్ ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ అన్నీ త‌ప్పుల త‌డ‌క అని విమ‌ర్శిస్తున్నారు. జ‌ల‌దృశ్యం పేరుతో రావినారాయ‌ణ‌రెడ్డి ఫంక్ష‌న్‌హాల్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. కేసీఆర్ చెబుతున్న కోటి ఎకరాలకుసాగునీటి మాట ఉత్త అబద్ధమని.. అందులో ఇసుమంత కూడా నిజం లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తన ప్రజంటేషన్ సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటల వీడియోను ప్రదర్శిస్తూ.. ఆయన చెప్పిన అంకెల్లోని మాయాజాలాన్ని విప్పి చెప్పే ప్రయత్నం చేశారు.  ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట భారీ అవినీతికి కేసీఆర్ సర్కారు పాల్పడుతుందని ధ్వజమెత్తారు తెలంగాణ అవిర్భావ సమయానికి తెలంగాణకు ఉన్న అప్పుడు   రూ.69వేల కోట్లు అయితే.. కేవలం మూడేళ్ల వ్యవధిలో ఈ అప్పు రూ.1.3లక్షల కోట్లకు చేరుకుంటుందని.. ఇంతకంటే దారుణమైన ప్రభుత్వం ఏముందని ప్రశ్నిస్తున్నారు.

అరవైఏళ్ల అప్పు రూ.69వేల కోట్లు అయితే.. కేవలం మూడేళ్లకు అంతే మొత్తం అప్పు కావటంలో అర్థం ఉందా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాకి లెక్కలతో కేసీఆర్ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని.. ఆయన చెబుతున్న గణాంకాలు ఏమాత్రం నిజం కావని చెబుతున్నారు. రూ.1.5లక్షల కోట్ల పనులకు టెండర్ల పనులు షురూ చేశారని.. పెద్ద ఎత్తున అప్పులు తీసుకురావటం.. ఆస్తుల అమ్మకంతో దేశంలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణాన్ని కేసీఆర్ నడిపిస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ ప్రజంటేషన్ లోని ప్రతి అంశానికి కౌంటర్ ఇస్తూ సాగుతున్న రియల్ జలదృశ్యం ఆసక్తికరంగా మారింది. నీళ్లు.. నిజాల పేరిట.. రియల్ జలదృశ్యం అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఇస్తున్న ప్రజంటేషన్ ను ఒక్క మాటలో చెప్పాలంటే.. కేసీఆర్ ప్రజంటేషన్ లోని ప్రతి అంశాన్ని.. అందులో ప్రస్తావించిన ప్రతి అంకెను బండకేసి బాదారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →