Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Does Chandra Babu has links with gangster Nayum?

By   /  August 11, 2016  /  Comments Off on Does Chandra Babu has links with gangster Nayum?

    Print       Email

chandrababuన‌యీంతో బాబుకు లింక్ ఉందా?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడ‌కు, న‌ర‌హంత‌కుడు, గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీంకు సంబంధాలు ఉన్నాయంటూ దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నరహంతకుడైన న‌యీంను పెంచి పోషించింది చంద్ర‌బాబేన‌ని ఆయన అభివర్ణించారు. ప్రజా కళాకారుల్ని.. ప్రజా సంఘాల నేతల్ని.. పౌరహక్కుల నేతల్ని పొట్టన బెట్టుకునేందుకు వీలుగా న‌యీంను చంద్రబాబు పెంచి పోషించినట్లుగా ఆయన ఆరోపించారు. బాబు అండదండలతోనే న‌యీం గ్యాంగ్ స్టర్ స్థాయికి ఎదిగాడని.. నక్సలైట్లను అంతం చేయటానికి న‌యీం తరహా బ్లాక్ కోబ్రాలను పెంచినట్లుగా విమర్శించారు. 2004.. 2008లతో తనను నయిం బెదిరించిన మాట వాస్తవమని చెప్పిన ఆయన నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు. ‘‘2008లో మా స్వగ్రామం చిట్టాపూర్ కు న‌యీం..  అతని అనుచరులు వ‌చ్చార‌ని, త‌న‌ను చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయార‌న్నారు. అప్పట్లో సిద్ధిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు.

వాస్తవానికి తాను 20 ఏళ్ల కిందటే గిరాయిపల్లి ఎన్ కౌంటర్ లో చనిపోవాల్సిదని.. ఆ రోజు అదృష్టం బాగుండి బతికిపోయానని చెప్పిన ఆయన ఇప్పుడీ జీవితం.. ఎమ్మెల్యే పదవి బోనస్ లాంటిద‌న్నారు. త‌న‌కు  ప్రాణాల మీద తీపి.. డబ్బు మీద ఆశ లేదని స్ప‌ష్టం చేశారు. న‌యీం లాంటి హంతకులు హెచ్చరికలు నా వెంట్రుకతో సమానం అని కూడా అనేశారు. అందుకే.. ఇప్పటికి గన్ మెన్స్ లేకుండానే ప్రజల్లో తిరుగుతున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అయిన చంద్ర‌బాబు అలాంటి వ్య‌క్తి పై రామ‌లింగారెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →