Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Dokka Manikya Varaprasad fires on Prathipati Pulla Rao

By   /  February 13, 2016  /  Comments Off on Dokka Manikya Varaprasad fires on Prathipati Pulla Rao

    Print       Email

dokka 1

టీడీపీ నేత డొక్కా సంచలన వ్యాఖ్యలు..!

InCorpTaxAct
Suvidha

 

టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణపై మంత్రి పుల్లారావు పూర్తి అవగాహనతో మాట్లాడాలని సూచించారు. ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ చేసే ఆలోచన లేదని మంత్రి పుల్లారావు అనడంపై.. మాజీ మంత్రి డొక్కా ఇలా స్పందించారు. సామాజిక న్యాయం కోసం సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారని ఆయన అన్నారు. అయితే మంత్రులు మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సున్నితమైన అంశాలపై మాట్లాడా లనుకుంటే పూర్తి సమాచారం తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. సమస్యపై అవగాహన లేకుండా పుల్లారావు సహా మంత్రులు ఎవరు మాట్లాడినా మంచిదికాదని తేల్చి చెప్పారు. అసంబద్ద వ్యాఖ్యలు చేస్తే గందరగోళానికి దారి తీస్తాయని హెచ్చరించారు. సమస్యలు మరింత కఠినంగా తయారవుతాయని అన్నారు. పుల్లారావుకు కేటాయించిన శాఖ చాలా ప్రాధాన్యత కలిగినదని డొక్కా అన్నారు. ఆయన దానిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని సూచించారు.

మాదిగలకు మందకృష్ణే నాయకుడని డొక్కా ఉద్ఘాటించారు. మందకృష్ణకు పుల్లారావు సర్టిఫికెట్‌ అవసరంలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం చాలా చిన్నదని.. ఆ పని తనకు అప్పగిస్తే 24 గంటల్లో పరిష్కారం చూపుతానని చెప్పారు. మందకృష్ణ సహా, మాదిగ నేతలతో రేపు సమావేశమవుతున్నానని తెలిపారు. మంత్రి పుల్లారావు వ్యాఖ్యలు, ఎస్సీ వర్గీకరణపై చర్చిస్తామని డొక్కా స్పష్టం చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →