ఆస్కార్ పండుగకు ముస్తాబవుతున్న డాల్బీ థియేటర్..!
88వ ఆస్కార్ బహుమతుల ప్రదానోత్సవానికి హాలీవుడ్ డాల్బీ థియేటర్ ముస్తాబవుతోంది.ఫిబ్రవరి 28న సాయంత్రం 5.30 గంటలకు ఈ పండుగ ప్రారంభం కానుంది. ఈ వేడుకలో భాగంగా 24 విభాగాలలో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. డేవిడ్ హిల్, రెజినాల్డ్ హడ్లిన్ సంయుక్తంగా నిర్వహించే ఈ అవార్డ్స్ వేడుకకు హాలీవుడ్ నటుడు క్రిస్ రాక్ చీఫ్ గెస్ట్ గా వ్యవహరించనున్నారు. క్రిస్ 2005లో కూడా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు.అంటే ఆయన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రావడం రెండవసారి అన్నమాట.
జనవరి 14న ప్రకటించిన నామినేషన్ల ప్రక్రియ 12వ తేదిన ఫైనల్ ఓటింగ్ తో ముగియనుంది. ఫైనల్ లిస్ట్ లో ఉన్న పోటీదారుల నుంచి విజేతలను ప్రకటించనున్నారు. వేదికపై బహుమతు లను అందజేసే 24 మంది జాబితాలో ఇండియా నుంచి ప్రియాంక చోప్రాకు అవకాశం దక్కిన విషయం తెలిసిందే. ఎప్పుడూ వెరైటీ డస్సింగ్ తో కనిపించే లేడీ గాగా కూడా ఈ జాబితాలో ఉన్నారు.ఉత్తమ చిత్రంగా బ్రాడ్‌పిట్ నటించిన ‘ది బిగ్ షార్ట్’ ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. స్టీవెన్ స్పీల్బర్గ్ చిత్రం ‘బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్’.. ‘ది బిగ్ షార్ట్’ మూవీకి గట్టిపోటీగా నిలుస్తోంది.ది బిగ్ షార్ట్‌లో నటించిన ఆడమ్ మెకే ఉత్తమ నటుడుగా అవార్డు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ‘రూమ్’ మూవీలో నటించిన బ్రీ లార్సన్ ఉత్తమ నటి అవార్డు దక్కించుకునే ఛాన్స్ కనిపిస్తోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.