మరోసారి మీడియాపై దుమ్మెత్తిపోసిన డోనాల్డ్ ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై దుమ్మెతిపోశారు.’న్యూయార్క్ టైమ్స్’ పత్రిక అబద్దాలు రాస్తోందని ఆరోపించారు. సదరు పత్రికది దుష్ట తలంపు అంటూ విమర్శలు గుప్పించారు. పలు సందర్భాల్లో ఆ పత్రిక రాసేది తప్పుడు కథనాలను ప్రచురిస్తోందని అన్నారు. ఆ పత్రిక వైఖరి ఎప్పటికీ మారదు అంటూ ఓ వైబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. గత రెండేళ్లుగా ఆ పత్రికను గమనించండి అంటూ చెప్పారు. అధ్యక్ష ఎన్నికల విషయంలో కూడా ఆ పత్రిక అంచనాలు తారుమారు అయ్యాయని విమర్శించారు. ఈ విషయంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని అన్నారు.
అలాగే తాను కేవలం తప్పుడు ప్రచారం చేసే మీడియాకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. అంతేతప్ప మొత్తం మీడియాకు తాను వ్యతిరేకం కాదని ట్రంప్ అన్నారు. ఈ రెండింటికి చాలానే తేడా ఉందన్నారు. తప్పుడు మీడియా ఓ విపక్ష పార్టీ లాంటిదన్నారు. అది దేశ ప్రజలకు శత్రువులాంటిదని అన్నారు. చాలా కష్టపడి పనిచేసే జర్నలిస్టులు చాలామంది తనకు తెలుసని చెప్పారు. మహిళల గురించి ఏవేవో వ్యాఖ్యలు చేశానంటూ న్యూయార్క్ టైమ్స్ తన పత్రికలో కథనాన్ని ప్రచురించిందని మండిపడ్డారు. అయితే తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆ మహిళలే పేర్కొన్నారని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.