గందగోళంగా సాగిన ట్రంప్ – ఏంజెలా మెర్కెల్ భేటీ..
జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ తో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. అయితే వీరి సమావేశం గందరగోళంగా సాగింది. ఆమె వచ్చిన వెంటనే సాదరంగా ఆహ్వానం పలికారు. అయితే భేటీ సందర్భంగా మాత్రం ఖరాఖండీగా వ్యవహరించారని సమాచారం. ట్రంప్ కు షేక్ ఇచ్చేందుకు మెర్కెల్ పలుమార్లు దగ్గరగా వచ్చారు. కాని ట్రంప్ మాత్రం పెద్దగా స్పందించలేదు. తన రెండు చేతులు కాళ్ల మధ్య పెట్టుకుని కిందకు చూస్తూ ఉండిపోయారు.
ఇక మీడియా కలుగజేసుకుని అడిగినా కూడా ట్రంప్ షేక్ హ్యాండ్ ఇచ్చే విషయంలో స్పందించలేదు. దీంతో పలువురు నేతలు ట్రంప్ తీరును తప్పుబడుతున్నారు. ఇరువురు నేతలు సమావేశంలో వాణిజ్యం, ఇమ్మిగ్రేషన్, వైర్ ట్యాపింగ్, రష్యా వంటి అంశాలపై చర్చించారు. వీరి భేటీ సందర్భంగా తమ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలను దాచిపెట్టేందుకు ఇరువురు బాగా ట్రై చేశారని అంతర్జాతీయ నేతలు చర్చించుకుంటున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.