పోలండ్ ఫస్ట్ లేడీకి షేక్ హ్యాండ్ ఇవ్వబోయిన డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫారెన్ టూర్స్ కంటే అక్కడ ఆయన ఫేస్ చేసే కష్టాలే ఫ్యామస్ అవుతున్నాయి. ఈ మధ్య ఆయన ఇజ్రాయెల్, రోమ్ పర్యటనలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ట్రంప్ తన భార్య మిలానియా చేతిని అందుకోడానికి ప్రయత్నించారు. కాని ఆమె ట్రంప్ చేతిని విదిలించుకున్న విషయం వార్తల్లో వచ్చిన విషయం తెలిసిందే.ఇలాంటిదే తాజాగా పోలాండ్‌లోనూ జరిగింది. పోలాండ్ ప్రథమ మహిళకు ట్రంప్ షేక్‌హ్యాండ్ ఇవ్వబోయారు.అయితే ఆమె మాత్రం మిలానియా వైపు వెళ్లారు. ఇదికాస్తా మళ్లీ కెమెరా కంటికి చిక్కింది.
అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ కు పోలాండ్ అధ్యక్షుడు ఆంద్రెజ్ దుడా ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆంద్రెజ్కు ట్రంప్ షేక్‌హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత పక్కనే ఉన్న పోలాండ్ అధ్యక్షుడి సతీమణి అగాటా కోర్న్హౌషర్కు షేక్ హ్యాండ్ ఇవ్వబోయారు. కాని ఆమె మాత్రం ట్రంప్‌ను దాటుకుని వెళ్లి మిలానియాకు షేక్‌హ్యాండ్ ఇచ్చి మాట్లాడారు. ఆ తర్వాత కాసేపటికి వెనక్కు తిరిగి ట్రంప్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సీన్ కాస్తా మీడియా కెమెరాకు చిక్కింది. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ అయిపోయింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.