డోనాల్డ్ ట్రంప్ ప్రమాదకర వ్యక్తి.. రష్యా టీవీ ఛానెల్స్ కథనాలు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ కు రష్యా సపోర్ట్ చేసిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంలో పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వెలువడ్డాయి. తర్వాత ట్రంప్ , పుతిన్ మధ్య ఇరు దేశాల మధ్య సయోధ్య కుదురుతుందని పలువురు ఆశించారు. అయితే ప్రస్తుత పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. సిరియాపై అమెరికా దాడి తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోయాయి. అలాగే ఉత్తర కొరియాపై ఏ క్షణమైనా అమెరికా దాడులు చేయవచ్చని వార్తలు వెలువడ్డాయి.
ఇదిలాఉంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కంటే డోనాల్డ్ ట్రంప్ అత్యంత ప్రమాద కారి అంటూ రష్యా టీవీ ఛానెల్ ఒకటి పేర్కొంది. క్రెమ్లిన్ ప్రముఖ టీవీ జర్నలిస్ట్ ఒకరు ఈ మేరకు వ్యాఖ్యానించారు. కిమ్ కంటే ట్రంప్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని ఆ జర్నలిస్ట్ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని రష్యాకు చెందిన పలు టీవీ ఛానెళ్ళు కూడా ప్రసారం చేశాయి.
కిమ్ తన కుటుంబానికి అధికారంలో అవకాశం కల్పించలేదని పేర్కొన్నాయి. కాని ట్రంప్ మాత్రం తన కుమార్తె ఇవాంకకు ఏకంగా పాలనలో భాగస్వాయ్యం కల్పించారని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షిణించే అవకాశం ఉందన అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా ప్రభుత్వం పరోక్షంగా ట్రంప్ కు వ్యతిరేకతను ఇలా తెలియజేస్తోందని భావిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.