Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

Donate your Sperm for rose gold iPhone offer in China

By   /  June 16, 2016  /  Comments Off on Donate your Sperm for rose gold iPhone offer in China

    Print       Email

వీర్యం ఇస్తే ఐ ఫోన్ ఫ్రీSperm

 

InCorpTaxAct
Suvidha

 

 

పండ‌గ‌ల‌కు కానీ.. ఏదైనా స్పెష‌ల్ డేస్‌లో కానీ కంపెనీలు ఆఫ‌ర్లు ప్ర‌క‌టించ‌డం చూశాం. కానీ ఆ దేశంలో దేని కోసం ఆఫ‌ర్లు ప్ర‌క‌టించారో తెలుసుకుంటే ఆశ్చ‌ర్య‌పోతారు. అంతేకాదు వాళ్లు రాసే స్లోగ‌న్స్ చ‌దువుకుంటే న‌వ్వుకుంటారు కూడా. అయితే వాళ్లు వాళ్ల దేశం కోసం చేస్తున్న కృషిని మాత్రం అభినందించ‌క మాన‌రు. ఇంత‌కు విష‌య‌మేమిటంటే… చైనాలోని స్పెర్మ్ బ్యాంకులు మ‌గ‌వారి వీర్యం కోసం ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. వీర్యం దానం చేసే యువ‌త కోసం కొత్త కొత్త ఆఫ‌ర్లు పెడుతున్నాయి.  వెయ్యి డాల‌ర్ల క్యాష్ లేదంటే రోజ్ గోల్డ్ ఐఫోన్ ఇస్తామంటూ ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నాయి. అయితే ఇదంతా 20నుంచి 45 ఏళ్ల వాళ్ల‌కు మాత్ర‌మే అని చిన్న కండీష‌న్ కూడా పెడుతున్నాయి.  కాగా గ‌తంలో ఒక‌రినే పుట్టించుకోవాల‌ని చైనా ప్ర‌భుత్వం ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత ఏమైందో ఏమోకానీ

అయితే ఇప్పుడు రెండో సంతానానికి కూడా అనుమ‌తి ఇవ్వ‌డంతో వారికి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి.  దీనివ‌ల్ల వీర్యం దానం చేసే వారి సంఖ్య మ‌రింత త‌గ్గిపోయింది. కొన్ని స్పెర్మ్ బ్యాంకులైతే దేశ‌భ‌క్తి అంశాన్ని తెర‌పైకి తెస్తున్నాయి. దేశంలో వ‌య‌సు మీరుతున్న‌వారి సంఖ్య ఎక్కువ‌వుతున్న ఈ స‌మ‌యంలో మీ వీర్య‌మే దేశాన్నికాపాడుతుందంటూ యువ‌కుల‌కు సందేశాలు ఇస్తున్నాయి. వీర్యం దానం చేయ‌డ‌మంటే ర‌క్తం దానం చేయ‌డంలాంటిదేన‌ని, ఎంతో ఇచ్చిన స‌మాజానికి తిరిగి రుణం చెల్లించ‌డ‌మే అవుతుంద‌ని మ‌రికొన్ని బ్యాంకులు సెంటిమెంట్ దారిని ఎంచుకున్నాయి. ఏది ఏమైనా ఇది విన‌డానికి కొంచెం వింత‌గా ఉన్నా చైనా వాళ్లు వాళ్ల దేశ జ‌నాభాను పెంచుకోవ‌డం చేస్తున్న ప్ర‌య‌త్నాలు చూస్తే ముచ్చ‌టేయ‌క మాన‌దు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →