మోదీపై విమర్శలు చేయకండి.. కన్నయ్యకు లూథియానా సామాజిక వేత్త సవాల్..
ఢిల్లీలోని జెఎన్ యూ విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్కు లూథియానాకు చెందిన సామాజికవేత్త జాహ్నవి బెహెల్ సవాలు విసిరారు. భావప్రకటనా స్వేచ్ఛ గురించి బహిరంగంగానే మాట్లాడదామంటూ ఆమె కోరారు. భారతీయులు ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న ప్రధాని మోదీ పట్ల.. నోటికొచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అనవసరంగా మోదీని విమర్శించే బదులు కన్నయ్యపై దేశద్రోహంపై వ్యాఖ్యలు చేసిన వారి గురించి విమర్శించాలని ఆమె సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో భాగంగా సామాజిక వేత్త జాహ్నవి అవార్డు అందుకున్నారు. దేశద్రోహం ఆరోపణలపై కన్నయ్యకుమార్ అరెస్టై.. రీసెంట్ గా బెయిల్పై రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెఎన్ యూలో కన్నయ్య ప్రసంగించారు. తనకు భారత్ నుంచి స్వేచ్ఛ అవసరం లేదన్నారు. తాము దేశంలోనే స్వేచ్ఛ కోరుకుంటున్నామన్నారు. దీనిపై జాహ్నవి స్పందించారు.
జేఎన్యూ క్యాంపస్ లో అభ్యంతరకర వ్యాఖ్యలు ఎవరు చేశారన్నది తెలుసుకునే ప్రయత్నం చేయకుండా కన్నయ్య ప్రధాని మోదీని ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. కేవలం ఆయన్ను విమర్శిస్తూ ఎందుకు కూర్చున్నట్లు అని ఆరోపించారు. వీలుంటే ఇదే విషయాన్ని బహిరంగంగా చర్చించుకుందామన్నారు. పలు సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న జాహ్నవి సేవల్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.